జయశంకర్ సహా రాజ్యసభకు 11 మంది ఏకగ్రీవం
X
రాజ్యసభకు 11 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ సహా తృణమూల్ నేత డెరెక్ ఓబ్రెయిస్ పెద్దల సభలో మళ్లీ అడుగుపెట్టనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 11 మంది సభ్యుల పదవీకాలం ముగియడంతో ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే పార్టీలు ప్రకటించిన అభ్యర్థులకు పోటీగా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.
బెంగాల్‌లో 6, గుజరాత్‌లో 3, గోవాలోని ఒక స్థానానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అయితే ఎన్నికలు లేకుండానే అవన్నీ ఏకగ్రీవం కానున్నాయి. తృణమూల్ కు చెందిన ఆరుగురు, బీజేపీకి చెందిన ఐదుగురు నేతలు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. గుజరాత్ నుంచి జైశంకర్‌తో పాటు బాబు దేశాయ్, దేవ్‌సింగ్ జాలా పోటీలో ఉన్నారు. బెంగాల్ నుంచి డెరెక్ ఓబ్రెయిన్, డోలా సేన్, సుఖేందు శేఖర్ రే, సమీరుల్ ఇస్లాం, ప్రకాశ్ చిక్ బరాక్, సాకేత్ గోఖలే బరిలో ఉండగా.. గోవా నుంచి సదానంద్ షెట్ తనవాడే బరిలో నిలువగా వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
245 మంది సభ్యులున్న రాజ్యసభలో జులై 24 తర్వాత మరో 7 సీట్లు ఖాళీ కానున్నాయి. ఇందులో జమ్మూకశ్మీర్ నుంచి 4, ఉత్తరప్రదేశ్ నుంచి 2 నామినేటెడ్‌తో పాటు మరో సీటు ఖాళీ కానుంది.