Home > జాతీయం > 120 నిమిషాలు.. 61వేల పిడుగులు.. ఎంతమంది బలయ్యారంటే..?

120 నిమిషాలు.. 61వేల పిడుగులు.. ఎంతమంది బలయ్యారంటే..?

120 నిమిషాలు.. 61వేల పిడుగులు.. ఎంతమంది బలయ్యారంటే..?
X

ఒడిశాలో అసాధారణ పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న రాష్ట్రంలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. కేవలం 2గంటల వ్యవధిలో రాష్ట్రంలో 61వేల పిడుగులు పడ్డాయి. వాటి కారణంగా 12 మంది చనిపోయారు.

ఒడిశావ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి పిడుగులు తోడయ్యారు. శనివారం ఒక్క రోజే 2గంటల వ్యవధిలో 61వేల పిడుగులు పడ్డాయి. పిడుగు పాటు కారణంగా గజపతి, జగత్‌ సింగ్‌పూర్‌, పూరీ, బలంగీర్‌ జిల్లాల్లో 12 మంది మృతి చెందగా.. 14 మంది గాయపడ్డారు. పలు జిల్లాల్లో పశువులు కూడా మృత్యువాత పడ్డాయి మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 7 వరకు జనం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

పిడుగుపాటు కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఒడిశా సర్కారు పరిహారం ప్రకటించింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.4 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పింది. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 48 గంటల్లో అల్పపీడనంగా మారొచ్చని ఐఎండీ ప్రకటించింది. దీని ప్రభావంతో ఒడిశా అంతటా వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు.




Updated : 4 Sep 2023 9:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top