Home > జాతీయం > నా భార్యకు న్యాయం చేయండి..ఆర్మీ జవాను వీడియో వైరల్..

నా భార్యకు న్యాయం చేయండి..ఆర్మీ జవాను వీడియో వైరల్..

నా భార్యకు న్యాయం చేయండి..ఆర్మీ జవాను వీడియో వైరల్..
X

తమిళనాడులో ఉంటున్న తన భార్యపై 120 మంది దాడి చేశారని ఓ ఆర్మీ జవాను ఆరోపించారు. ప్రస్తుతం విధుల నిమిత్తం కశ్మీర్‏లో ఉంటున్న జవాను సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేసి డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ వీడియోను కాస్త ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్‌ కర్నల్‌ ఎన్‌.త్యాగరాజన్‌ తన ట్విటర్‌ అకౌంట్లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. తమిళనాడుకు చెందిన జవాను ప్రభాకరన్‌ కశ్మీర్‎లో హవాల్దార్‌గా పని చేస్తున్నారు. ఈయన కుటుంబం ప్రస్తుతం నాగపట్నం జిల్లాలోని కందవాసల్‌లో ఉంటోంది.

ఈ వీడియోలో జవాన్ మాట్లాడుతూ "నా భార్య ఓ స్థలాన్ని లీజుకు తీసుకుంది. అక్కడే ఓ షాపును ఏర్పాటు చేసుకుంది. కానీ ఆమెపై 120 మంది దాడి చేశారు. నా భార్యను అర్థనగ్నంగా చేసి మరీ దారుణంగా కొట్టారు. షాపులోని వస్తువులను ధ్వంసం చేశారు. ఈ దారుణం గురించి నేను ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాను. డీజీపీ సర్‌, దయ చేసి ఈ విషయంలో నాకు , నా భార్యకు సాయం చేయండి. వారు కత్తులతో నా కుటుంబంపై దాడి చేస్తున్నారు. వారిని భయపెడుతున్నారు" అని తెలిపారు.


ఈ విషయంలో కందవాసల్‌ పోలీసుల ఏమంటున్నారంటే.. "ప్రభాకరన్‌ భార్య లీజుకు తీసుకున్న భూమి ఓ దేవాలయానిది. అతడి మామ రూ.9.5 లక్షలకు కుమార్‌ అనే వ్యక్తి నుంచి ఈ భూమిని లీజుకు తీసుకొన్నాడు. అనంతరం కుమార్‌ చనిపోయాడు. అతడి కొడుకు రాము షాపును తిరిగి తీసుకోవాలనుకున్నాడు. నగదు తిరిగి ఇచ్చేందుకు రాముతో సెల్వమూర్తికి ఒప్పందం కూడా అయ్యింది. కానీ, ఆ తర్వాత సెల్వమూర్తి అంగీకరించలేదు. ఈ క్రమంలో జూన్‌ 10న రాము షాపుకు వెళ్లి సెల్వమూర్తి కుమారులకు డబ్బు ఇచ్చేశాడు. కానీ, వారు ‘తనపై కత్తితో దాడికి దిగారని ఆరోపించాడు. దీంతో రాముకు మద్దతుగా చుట్టుపక్కనవారు నిలిచారు. అదే సమయంలో షాపులో ప్రభాకరన్‌ భార్య కీర్తి, ఆమె తల్లి షాపులో ఉన్నారు. కానీ వారిపై దాడి జరగలేదు.ఈ రోజే కీర్తి ఆస్పత్రిలో చేరింది. దీంతో ప్రభాకరన్‌ ఆమెపై దాడికి దిగారని భావిస్తున్నారు". అని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Updated : 12 Jun 2023 10:55 AM IST
Tags:    
Next Story
Share it
Top