Home > జాతీయం > 13 మందిని ఆస్పత్రిపాలు చేసిన మండీ బిర్యానీ

13 మందిని ఆస్పత్రిపాలు చేసిన మండీ బిర్యానీ

13 మందిని ఆస్పత్రిపాలు చేసిన మండీ బిర్యానీ
X

గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మండి క్రూడ్ హోటల్లో తిన్న 13 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. వీళ్లంతా పశ్చిమ నియోజకవర్గం 58 వ వార్డు పరిధి ములగాడ గ్రామానికి చెందిన యువకులు. ఆదివారం రాత్రి భోజనం చేసి ఇంటికి వచ్చిన వారిలో 13 మందికి సోమవారం వేకువ జామున 4 గంటల ప్రాంతం నుంచి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో.. వెంటనే వారిని కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత వారిని తీరిగి ఇంటికి తీసుకెళ్లారు. అయితే, ఇంటికి వెళ్లిన అనంతరం మరల అదే పరిస్థితి. దీంతో.. హుటాహుటిన సమీపంలోని సెయింట్ ఆన్స్ ఆసుపత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. మొత్తంగా ఇష్టంగా బిర్యానీ తిని 13 మంది యువకులు తీవ్ర అస్వస్థతకు గురికావడం స్థానికంగా కలకలం రేపుతోంది.




Updated : 10 Oct 2023 12:10 PM IST
Tags:    
Next Story
Share it
Top