Kerala Court : కేరళ కోర్టు సంచలన తీర్పు..15 మంది దోషులకు శిక్ష ఖరారు
X
కేరళ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బీజేపీ నేత హత్య కేసులో 15 మందికి ఉరిశిక్ష విధించింది. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అయిన రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మంది పీఎఫ్ఐ కార్యకర్తలకు కోర్టు మరణశిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. 2021 డిసెంబరు 19వ తేదీన కేరళలోని అలప్పుళలో పీఎఫ్ఐ, ఎస్డీపీఐ కార్యకర్తలు రంజిత్ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల ఎదుటే అతి దారుణంగా ఆయన్ని హత్య చేశారు. ఈ కేసును విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా తీర్పు చెప్పింది.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థతో సంబంధం ఉన్న 15 మంది నిందితులను కేరళ కోర్టు దోషులుగా తేల్చింది. ఈ హత్యా కేసులో ప్రధానంగా 8 మంది నిందితులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని, మిగిలినవారంతా నేరపూరిత కుట్రకు పాల్పడినట్లుగా కోర్టు నిర్ధారించింది. దీంతో నిజాం, అజ్మల్, అనూప్, మహ్మద్ అస్లాం, సలాం, అబ్దుల్ కలాం, సఫరుద్దీన్, మున్షాద్, బజీబ్, నవాజ్, షెమీర్, నజీర్, జాకీర్ హుస్సేన్, షాజీ, షమ్నాజ్‌లను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ 15 మందికి కోర్టు మరణశిక్ష విధిస్తూ నేడు తీర్పునిచ్చింది.