Home > జాతీయం > రైల్వేలో 160 కి.మీ.వేగంలోనూ ‘కవచ్‌’ పనితీరు భేష్‌

రైల్వేలో 160 కి.మీ.వేగంలోనూ ‘కవచ్‌’ పనితీరు భేష్‌

రైల్వేలో 160 కి.మీ.వేగంలోనూ ‘కవచ్‌’ పనితీరు భేష్‌
X

ఇండియన్ రైల్వే భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా రీసెర్చ్ డిజైన్స్ అండ్‌ స్డాండర్డ్‌ ఆర్గనైజేషన్‌ అభివృద్ధి చేసిన సిస్టమ్‌ "కవచ్‌" పనితీరును రైల్వే అధికారులు పరిశీలించారు. హరియాణాలోని పల్వాల్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర స్టేషన్ల మధ్య నడిచే సెమీ-హైస్పీడ్‌ రైలులో ఈ వ్యవస్థను ఏర్పాటుచేసి పరీక్షించినట్లు ఆగ్రా రైల్వే డివిజన్‌ ప్రతినిధి ప్రశస్తి శ్రీవాస్తవ తెలిపారు. గంటకు 160 కి.మీ. వేగం వద్ద ఇది సమర్థంగా పనిచేసిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. సైమీ హైస్పీడ్ ఇంజిన్‌లో కవచ్ బ్రేకింగ్ పనితీరును పరిశీలించేందుకు ట్రయల్స్ నిర్వహించినట్లు నార్త్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.

దిల్లీ-ఆగ్రాల మధ్య ఉన్న 125 కి.మీ. నెట్‌వర్క్‌ను అధికారులు మూడు భాగాలుగా విభజించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్‌వర్క్‌లో గరిష్ఠ వేగం 130 కి.మీ.లు కాగా.. దిల్లీ-ఆగ్రాల మధ్య మాత్రం 160 కి.మీ. గతేడాది డిసెంబరులో కవచ్‌ను ఈ మార్గంలో 140 కి.మీ. వేగం వద్ద పరీక్షించారు.

వందే భారత్‌ వంటి సెమీ-హైస్పీడ్‌ రైళ్ల నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న క్రమంలో ఇలాంటి వ్యవస్థలు ప్రమాదాల నియంత్రణలో కీలకమవుతాయని అధికారులు తెలిపారు. రైల్వోలో ప్రమాదాలను నియంత్రించేందుకు ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. కవచ్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. అయితే ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే.. ఏదైనా సాంకేతిక లోపంతో ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా లేదా వెనుక నుంచి వచ్చి ఢీకొనకుండా కవచ్‌ వ్యవస్థ పనిచేస్తుంది. రైళ్లు నిలిచిపోయేలా ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ బ్రేకులు వేస్తుంది. రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకోపైలెట్‌ రైలును నడిపిస్తున్నప్పుడు కవచ్‌ వ్యవస్థ అప్రమత్తం అవుతుంది. ఆటోమెటిక్‌గా బ్రేకులు విధిస్తుంది. దీంతోపాటు పట్టాలు సరిగా లేనప్పుడు, ఇతర టెక్నికల్‌ సమస్యలు వచ్చినప్పుడు కవచ్‌ వ్యవస్థ లోకోపైలెట్‌ను అప్రమత్తం చేస్తుంది. మరియు బ్రిడ్జ్‌, మలుపులు వద్ద రైలు పరిమితికి మించిన వేగంతో వెళ్తుంటే.. కవచ్‌ వ్యవస్థ రైలు వేగాన్ని 30km/h ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది.


Updated : 25 Jan 2024 11:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top