Home > జాతీయం > యూపీలో దారుణం.. క్రికెట్‌లో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడని గొంతు పిసికి చంపేశాడు

యూపీలో దారుణం.. క్రికెట్‌లో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడని గొంతు పిసికి చంపేశాడు

యూపీలో దారుణం.. క్రికెట్‌లో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడని గొంతు పిసికి చంపేశాడు
X

ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ లో క్లీన్ బౌల్డ్ చేశాడన్న కోపంతో తన స్నేహితుడి గొంతు పిసికి చంపేశాడు ఓ బాలుడు. కాన్నూర్ జిల్లాలోని ఘటంపూర్ మండలం రహ్తి డేరా గ్రామంలో బుదవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉన్న గ్రౌండ్ లో క్రికెట్ ఆడారు పిల్లలు. అందులో ఓ 14 ఏళ్ల బాలుడు, 17 బాలుడిరి క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే, ఓట్ అయినా ఆ బాలుడు పిచ్ వదిలి వెళ్లడానికి నిరాకరించాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ మొదలయింది. ఆ గొడవలో 17 ఏళ్ల బాలుడికి తన సోదరుడు కూడా తోడయ్యాడు. ఆ ఇద్దరు కలిసి 14 ఏళ్ల బాలుడిని తీవ్రంగా కొట్టి, గొంతు పిసికి చంపేశారు. తర్వాత ఇద్దరు పారి పోయారు.

మృతుడి కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితులకు శిక్ష పడే వరకు అంత్యక్రియలు చేసేది లేదని, పోస్ట్ మార్టానికి అనుమతించేది లేదని గొడవకు దిగారు. ఆ తర్వాత అధికారుల హామీ మేరకు మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు.

Updated : 21 Jun 2023 9:17 PM IST
Tags:    
Next Story
Share it
Top