Home > జాతీయం > స్వాతంత్ర్య దినోత్సవానికి సర్వం సిద్ధం.. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే..?

స్వాతంత్ర్య దినోత్సవానికి సర్వం సిద్ధం.. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే..?

స్వాతంత్ర్య దినోత్సవానికి సర్వం సిద్ధం.. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే..?
X

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబైంది. ఆగస్టు 15 ఉదయం 8గంటలకు ప్రధాని నరేంద్రమోడీ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. పాలనలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈసారి కూడా సామాన్యులను వేడుకలకు అతిధులుగా ఆహ్వానించారు. దాదాపు 1800 మంది స్పెషల్ గెస్టులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. వారిలో గ్రామసర్పంచులు, ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీం, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణంలో చెమటోడ్చిన శ్రమ్ యోగి, దేశ సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం, అమృత్ సరోవర్, హర్ ఘర్ జల్ యోజనలో పాల్గొన్న కార్మికులు, ప్రైమరీ స్కూల్ టీచర్లు, నర్సులు, మత్స్యకారులు స్పెషల్ గెస్టుల లిస్టులో ఉన్నారు.

స్వాతంత్ర వేడుకల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని 12 ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు. కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరించేలా ఈ సెల్ఫీ పాయింట్లను తీర్చిదిద్దారు. దీంతో పాటు రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఆన్ లైన్ సెల్ఫీ కంటెస్ట్ నిర్వహించనున్నారు. ఆగస్టు 15 నుంచి 20 వరకు మై గవర్నర్ పోర్టల్ ఫాంలో వాటిని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి స్పాట్ నుంచి ఒక విజేత చొప్పున 12 మందిని ఎంపికచేసి రూ.10వేల చొప్పున నగదు పురస్కారం అందజేయనున్నారు.

ప్రధాని మోడీ జెండా ఎగరేసిన వెంటనే వేడుకలకు హాజరైన వారిపై పూల జల్లు కురిపించనున్నారు. ఎయిర్ ఫోర్స్ కు చెందిన లైట్ హెలికాప్టర్స్ మార్క్ 3 ధ్రువ్ లను ఇందుకోసం వినియోగించనున్నారు. ఇదిలా ఉంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ డీపీలుగా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకున్నారు. దేశ ప్రజంతా తమ డీపీలను మార్చాలని సూచించారు.

Updated : 13 Aug 2023 3:32 PM IST
Tags:    
Next Story
Share it
Top