Home > జాతీయం > టాటా స్టీల్ ప్లాంట్లో ప్రమాదం..19మందికి తీవ్రగాయాలు

టాటా స్టీల్ ప్లాంట్లో ప్రమాదం..19మందికి తీవ్రగాయాలు

టాటా స్టీల్ ప్లాంట్లో ప్రమాదం..19మందికి తీవ్రగాయాలు
X

ఒడిశాలోని టాటా స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. డెంక‌నాల్ జిల్లాలోని మేరమాండల్ ప్రాంతంలో ఉన్న టాటా స్టీల్‌ ప్లాంట్లో స్టీమ్‌ పైప్ పగిలిపోయింది. ఈ ఘటనలో 19 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్లాంట్‌లో ఉన్న హెల్త్ సెంట‌ర్‌లో ప్రాథ‌మిక చికిత్స అందించారు. అనంత‌రం మెరుగైన చికిత్స నిమిత్తం క‌ట‌క్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంపై టాటా స్టీల్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ‘‘మేరమాండల్‌లోని టాటా స్టీల్‌ వర్క్స్‌ కర్మాగారంలో బీఎఫ్‌పీపీ2 పవర్‌ ప్లాంట్‌ వద్ద ఆవిరి లీక్‌ కారణంగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అన్ని అత్యవసర ప్రొటోకాల్‌ సర్వీసులను యాక్టివేట్‌ చేశాం. ఘటన జరిగిన ప్రాంతాన్ని సీజ్‌ చేశాం. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాం. బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటాం’’ అని టాటా స్టీల్‌ తెలిపింది. ఘటనపై సంబంధిత అధికారులతో కలిసి అంతర్గత దర్యాప్తును ప్రారంభించినట్లు ప్రకటించింది.

Updated : 13 Jun 2023 6:08 PM IST
Tags:    
Next Story
Share it
Top