Home > జాతీయం > ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి
X

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేట్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 70 మంది వరకు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కడలూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ బస్సు టైర్ పేలి అదుపుతప్పడంతో ఎదురుగా వస్తున్న బస్సు ఢీ కొట్టింది. నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు,రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.





Updated : 19 Jun 2023 3:57 PM IST
Tags:    
Next Story
Share it
Top