Home > జాతీయం > సిక్కింలో 23 మంది భారత సైనికులు గల్లంతు

సిక్కింలో 23 మంది భారత సైనికులు గల్లంతు

సిక్కింలో 23 మంది భారత సైనికులు గల్లంతు
X

సిక్కిం రాష్ట్రంలోని లాచెన్ వ్యాలీలో ఆకస్మిక వరదల ముంచెత్తాయి. ఉత్తర సిక్కింలో కురిసిన కుండపోత వర్షానికి లాచెన్‌ లోయలో గల తీస్తా నది ఉప్పొంగడంతో వరద పోటెత్తింది. ఈ వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయినట్లు తెలుస్తోంది. సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం రెస్క్యూ కొనసాగుతోంది. లోయ వెంబడి ఉన్న అనేక ఆర్మీ స్థావరాలు దెబ్బతిన్నాయి.

ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సుపై క్లౌడ్ బరస్ట్ అయ్యింది. దీంతో తీస్తా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. అదే టైంలో చుంగ్‌థాంగ్‌ డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో పరిస్థితి తీవ్రమైంది. ఫలితంగా దిగువ ప్రాంతంలో నీటిమట్టం 15 -20 అడుగుల మేర పెరిగి మెరుపు వరదలు సంభవించాయి. ఈ వరదల్లో 23మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. సిక్కిం ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. తీస్తా నది చుట్టుపక్కల ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రవాహానికి తీస్తా నదిపై ఉన్న సింథమ్ ఫుట్ బ్రిడ్జి కూలిపోయింది.


Updated : 4 Oct 2023 4:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top