Home > జాతీయం > ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. 24 గంటల్లో 24 మరణాలు..

ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. 24 గంటల్లో 24 మరణాలు..

ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. 24 గంటల్లో 24 మరణాలు..
X

మహారాష్ట్ర దారుణం జరిగింది. నాందేడ్లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల వ్యవధిలో 24 మంది చనిపోయారు. వారిలో 12 మంది చిన్నారులు ఉన్నారు. సిబ్బంది, మందుల కొరత కారణంగానే ఇలాంటి దారుణం జరిగిందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నారు.

గత 24 గంటల్లో చనిపోయిన 12 మంది స్త్రీ, పురుషులు చనిపోగా వారిలో చాలా మంది పాముకాటు కారణంగానే ప్రాణాలు వదిలారని హాస్పిటల్ డీన్ చెప్పారు. ఇటీవలే సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడంతో తీవ్ర కొరత ఏర్పడిందని ఫలితంగా సరైన వైద్య సేవలు అందించలేకపోతున్నామని అన్నారు. చనిపోయిన చిన్నారుల్లో ఆరుగురు మగ, ఆరుగురు ఆడ శిశువులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. హాస్పిటల్కు 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం నుంచి వస్తారని, ఇటీవలి కాలంలో రోగుల తాకిడి మరింత పెరిగిందని చెప్పారు. బడ్జెట్ లేని కారణంగానే మందుల కొరత ఏర్పడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల్లో 24 మంది చనిపోవడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఏక్నాథ్ షిండే ప్రభుత్వ వైఖరి కారణంగానే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని అంటున్నాయి. ఈ ఘటనకు బీజేపీ, షిండే, అజిత్ పవార్ నేతృత్వంలోని ట్రిపుల్ ఇంజిన్ సర్కారు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.




Updated : 2 Oct 2023 8:41 PM IST
Tags:    
Next Story
Share it
Top