Home > జాతీయం > జిమ్‌లో ట్రెడ్‎మిల్‌పై‎ రన్నింగ్.. యువకుడు మృతి..!

జిమ్‌లో ట్రెడ్‎మిల్‌పై‎ రన్నింగ్.. యువకుడు మృతి..!

జిమ్‌లో ట్రెడ్‎మిల్‌పై‎ రన్నింగ్.. యువకుడు మృతి..!
X

జిమ్‌లో మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ట్రెడ్‎మిల్‎పై పరిగెడుతుండగా విద్యుత్ ఘాతానికి గురై చనిపోయాడు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుడు రోహిణి సెక్టార్ 19లో నివాసం ఉండే పృధ్వీగా గుర్తించారు.

24 ఏళ్ల పృధ్వీ తనకు సమీపంలో ఉన్న సెక్టార్ 15లోని జింప్లెక్స్ ఫిట్‌నెస్ జోన్‌కు తరచూ వెళ్లుండేవాడు. ఎప్పటిలాగే మంగళవారం సాయంత్రం కూడా జిమ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలోనే ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

యువకుడు పోస్ట్ మార్టంలో కరెంట్ షాక్‌‌కు గురైనట్లు తేలింది. యంత్రాల వాడకలో నిర్లక్ష్యమే మరణానికి కారణమైనట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిమ్ మేనేజర్ అనుభవ్ దుగ్గల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై IPC సెక్షన్ 287 కింద కేసు నమోదు చేశారు.

Updated : 20 July 2023 4:32 PM IST
Tags:    
Next Story
Share it
Top