27 ఏళ్ల ఐఐఎం విద్యార్థికి గుండెపోటు..
X
గుండె పోటు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వయుస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. 25 నుంచి 40 ఏళ్ల యువకులు కూడా గుండె పోటుతో చనిపోవడం కలకలం రేపుతోంది. ఆరోగ్య వంతులు కూడా ఉన్న చోటనే ప్రాణాలు వదిలేస్తున్నారు. జిమ్ చేస్తుండగా, ఆట ఆడుతుండగా, డ్యాన్స్ చేస్తుండగా ఇలా ఒక్కసారిగా కుప్పకూలి చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో యువకుడు తక్కువ వయుస్సులోనే హార్ట్ ఎటాక్‌తో చనిపోవడం కలకలం రేపుతోంది.
బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో చదువుతున్న 27 ఏళ్ల ఆయుష్ గుప్తా గుండెపోటుతో చనిపోయాడు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. వైద్యులు గుండెపోటుగా నిర్ధారించారు. అతను మేనేజ్‌మెంట్ కోర్సులో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (PGP) రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఆయుష్ గుప్తా PGP యొక్క విద్యార్థి పూర్వ విద్యార్థుల కమిటీకి సీనియర్ కోఆర్డినేటర్. మృతుడు ఫెరింగ్ క్యాపిటల్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేశాడని ఐఐఎం ట్విట్టర్ ద్వారా తెలిపింది. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. ఆయుష్ గుప్తా చాలా తెలివైన విద్యార్థి అని ట్విట్టర్ లో రాసుకొచ్చింది.
We are deeply saddened by the demise of Ayush Gupta, our second-year PGP student, who suffered a cardiac arrest, this afternoon. Ayush (27) was senior coordinator of the Student Alumni Committee of PGP.
— IIM Bangalore (@iimb_official) July 23, 2023
1/3 pic.twitter.com/qTMyZdYvUX