Home > జాతీయం > Masjid Walls : జ్ఞానవాపి మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలు

Masjid Walls : జ్ఞానవాపి మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలు

Masjid Walls : జ్ఞానవాపి మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలు
X

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలను పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. కాశీ జ్ఞానవాపి మసీదు విషయంలో సంచలన విషయాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు పెద్ద హిందూ దేవాలయాలు ఉండేవి. ఈ విషయాన్ని మైసూర్‌లోని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ విభాగం తెలిపింది. మసీదు పశ్చిమ గోడ హిందూ దేవాలయంలో భాగమని గుర్తించింది.





మసీదు ప్రాంతంలో 32 హిందూ దేవాలయాల శాసనాలను అధికారులు గుర్తించారు. అందులో 3 తెలుగు శాసనాలు ఉన్నాయని ఏఎస్ఐ డైరెక్టర్ కె.మునిరత్నం తెలిపారు. ఆయన మాట్లాడుతూ..17వ శతాబ్దానికి చెందిన ఓ శాసనంలో నారాయణ భట్ల కుమారుడు మల్లన భట్ల పేరు ఉందని స్పష్టం చేశారు. తమకు లభించిన శాసనాలు దేవనాగరి, గ్రంథ, తెలుగు, కన్నడ లిపులలో ఉన్నట్లు తెలిపారు. శాసనాల నివేదికకు సంబంధించి కొన్ని విషయాలను వెల్లడించారు.





1585 ప్రాంతంలో కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణాన్ని తెలుగు బ్రాహ్మణుడు నారాయణ భట్లు పర్యవేక్షించినట్లు తెలిపారు. 1458-1505 ప్రాంతంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని హుస్సేన్ షర్కీ సుల్తాన్ కూల్చివేయగా దానిని 1585లో మళ్లీ ప్రతిష్టించారట. ఈ విషయం మసీదు గోడపై చెక్కబడిన తెలుగు భాష శాసనంలో ఉన్నట్లు తెలిపారు. రెండవ తెలుగు శాసనంలో గొర్రెల కాపరుల గురించి ప్రస్తావించారట. మూడవ తెలుగు శాసనంలో అక్షరాలు పూర్తిగా అరిగిపోయినట్లు ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం వెల్లడించారు.







Updated : 31 Jan 2024 10:37 AM IST
Tags:    
Next Story
Share it
Top