Home > జాతీయం > బోరుబావిలో పడ్డ చిన్నారి సురక్షితం.. వెలికితీసిన రెస్క్యూ టీం

బోరుబావిలో పడ్డ చిన్నారి సురక్షితం.. వెలికితీసిన రెస్క్యూ టీం

బోరుబావిలో పడ్డ చిన్నారి సురక్షితం.. వెలికితీసిన రెస్క్యూ టీం
X

బీహార్ లో బోరుబావిలో పడ్డ చిన్నారి మృత్యుంజయుడిగా నిలిచాడు. 40 అడుగుల లోతులో చిక్కుకుపోయిన మూడేళ్ల శివం కుమార్ ను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. బోరుబావి నుంచి బయటకు తీసిన వెంటనే ప్రాథమిక చికిత్స చేసి బాబును హాస్పిటల్ కు తరలించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు.

నలంద జిల్లాలోని కుల్ గ్రామంలో ఆదివారం ఉదయం మూడేళ్ల బాబును తల్లి తనతో పాటు పొలానికి తీసుకెళ్లింది. ఆమె పనిలో ఉండగా చిన్నారి ఆడుకుంటూ పొరపాటున బోరుబావిలో పడిపోయాడు. 40 అడుగుల లోతులో చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ , జిల్లా అధికారులు ఘటనాస్థలికి చేరుకుని బాలుడిని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు.

పొలం యజమాని బోరు బావి వేయగా నీరు పడకపోవడంతో దానిని మూసివేయకుండా అలాగే వదిలేశాడు. దీంతో ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలోని ఒక గ్రామంలో ఇలాగే బోరు బావిలో ఓ బాలిక పడింది. ఎంతో శ్రమించి ఆమెను బయటకు తీసినప్పటికీ.. బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. జూన్ 6న మధ్యప్రదేశ్‌లోనే జరిగిన మరో ఘటనలో సహోర్ జిల్లాలో 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడి రెండున్నరేళ్ల పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది.




Updated : 23 July 2023 1:24 PM GMT
Tags:    
Next Story
Share it
Top