Home > జాతీయం > మణిపూర్ లో 30 మంది అదృశ్యం...

మణిపూర్ లో 30 మంది అదృశ్యం...

మణిపూర్ లో 30 మంది అదృశ్యం...
X

మణిపూర్ లో పరిస్థితులు చక్కబడటం లేదు. రోజుకో కొత్త వార్త తెలుస్తూనే ఉంది. కొన్ని రోజులుగా అక్కడ జరుగుతున్న ఘర్షణల కారణంగా జరిగి ఆకృత్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

మణిపూర్ లో ఘర్షణలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 30 మంది కనిపించకుండా పోయారు. వీరిలో టీనేజర్ల నుంచీ మిడిల్ ఏజ్ వరకూ ఉన్నారు. మొత్తం మూడు నెలల వ్యవధిలో 30 మంది అదృశ్యమయ్యారు. ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామని...అయినా కూడా వారి జాడ కనిపించడం లేదని చెబుతున్నారు పోలీసులు. ప్రస్తుతానికి 30 మందిగా ఉన్నప్పటికీ...ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తంగా 6 వేలకు పైగా ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.

అదృశ్యమయిన వారిలో ఒక్కొక్కరికి ఒక్కో కారణం కనిపిస్తోంది. వాళ్ళు ఎందుకు, ఎలా, ఎక్కడ కనిపించకుండా పోయారో కూడా తెలియడం లేదు. 47 ఏళ్ళ సమరేంద్ర సింగ్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త. ఉద్రిక్తతలు మొదలైన కొన్ని రోజులకే కనిపించకుండా పోయారు. మూడు నెలలు అవుతున్నా అతని జాడ లేదు. ఇతనితో పాటూ అతని స్నేహితుడు కూడా కనిపించడం లేదు. 17 ఏళ్ళ హిజామ్ లువాంగ్బీది ఇదే పరిస్థితి. బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళిన ఆమె అతనితో పాటూ కనిపించకుండా పోయింది. ఇద్దరి ఫోన్లూ స్విచ్ఛాఫ్ అయ్యాయి. అవి కేడా వేరు వేరు జిల్లాల్లో. ఇద్దరూ బైక్ మీద ఇంఫాల్కు సమీపంలోని నంబోల్ వైపు వెళ్ళారని సీసీ టీవీ ఫుటేజ్ లను బట్టి పోలీసులు చెబుతున్నారు. కలిసి వెళ్ళిన వాళ్ళ ఫఓన్లు రెండు వేర్వేరు జిల్లాల్లో ఎందుకు స్విచ్ఛాఫ్ అయ్యాయో తెలియడం లేదు. మిస్ అయిన వారందరి పరిస్థితి ఇంచుమించుగా ఇలానే ఉంది.

Updated : 2 Aug 2023 12:59 PM IST
Tags:    
Next Story
Share it
Top