Home > తెలంగాణ > Begumpet Airport : 2030 నాటి 30 కోట్లకు విమాన ప్రయాణికులు : కేంద్ర మంత్రి సింధియా

Begumpet Airport : 2030 నాటి 30 కోట్లకు విమాన ప్రయాణికులు : కేంద్ర మంత్రి సింధియా

Begumpet Airport : 2030 నాటి 30 కోట్లకు విమాన ప్రయాణికులు : కేంద్ర మంత్రి సింధియా
X

హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ ప్రమాణాలతో పౌర విమానయాన పరిశోధన కేంద్రం రూపుదిద్దుకుంటోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య శర వేగంగా పెరుగుతోందని సింధియా అన్నారు. 2023లో 15.3 కోట్ల మంది విమానల్లో ప్రయాణిస్తే ఆ సంఖ్య 2030 నాటికి 30 కోట్లుకు పెరుగుందని అంచన వేశారు. బేగంపేట్‌లో వింగ్స్ ఇండియా 2024 ప్రారంభోత్సవం పాల్గోన్నారు. ఉడాన్ స్కీమ్‌తో సామాన్య ప్రజలకు విమాన ప్రయాణం చేరువయ్యేలా ప్రధాని మోదీ చేశారని సింధియా కొనియాడారు. అనంతరం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉడాన్ పథకం కింద 517 మార్గాలు ప్రారంభమయ్యాయని, 9 హెలిపోర్ట్‌లు, 2 వాటర్ ఏరోడ్రోమ్‌తో సహా 76 విమానాశ్రయాలను కలుపుతూ విమానయాన సేవలు కొనసాగుతున్నాయన్నారు. ప్రాంతీయ పౌర విమానయాన మార్కెట్‌ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరించారు. పదేళ్లలో ఎంతో ప్రగతి సాధించామని, ముంబై, ఢిల్లీలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. వేగవంతమైన కనెక్టివిటీతో ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు చెప్పారు. దేశంలో 500 కొత్త ఇండిగో విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చినట్లు స్పష్టంచేశారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనన్స్ ఇంజినీరింగ్ కోర్సులను బోధించగలిగే ఏవియేషన్ స్కూల్ అయిన జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు మంత్రి జ్యోతిరాదిత్య వెల్లడించారు




Updated : 19 Jan 2024 7:52 AM IST
Tags:    
Next Story
Share it
Top