Home > జాతీయం > Reels in the hospital : ఆసుపత్రిలో రీల్స్..38 మంది వైద్య విద్యార్థులు సస్పెండ్

Reels in the hospital : ఆసుపత్రిలో రీల్స్..38 మంది వైద్య విద్యార్థులు సస్పెండ్

Reels in the hospital : ఆసుపత్రిలో రీల్స్..38 మంది వైద్య విద్యార్థులు సస్పెండ్
X

ప్రస్తుత జనరేషన్‌లో సోషల్ మీడియా వినియోగం విపరితంగా పెరిగిపోయింది. కొంత మంది యువత, సెలబ్రీటీలు వైరల్ కావడనికి తాము ఎక్కడ ఉన్నామో.. ఏం చేస్తున్నామనే విషయాన్ని మరిచిపోయి సెల్ఫీలు, వీడియోలతో హల్చల్ సృష్టిస్తున్నారు. తాజాగా కొందరు వైద్య విద్యార్థుల లైకుల కోసం ఆస్పత్రిలో రీల్స్ చేశారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో వెలుగు చూసింది. దీంతో ఆ విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. మెడికల్ స్టూడెంట్స్ ఏకంగా ఆసుపత్రిలోనే రీల్స్ చేశారు. గడగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌‌లో చదువుతున్న 38 మంది విద్యార్థుల ట్రైనింగ్‌ మరో 20 రోజుల్లో ముగియనుంది.

త్వరలో కళాశాలలో జరగనున్న ప్రీ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమం కోసం ఎలాంటి అనుమతి లేకుండా ఆసుపత్రిలోనే రీల్స్‌ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో.. విద్యార్థుల చర్యపై జీఐఎమ్‌ఎస్‌ డైరెక్టర్ డాక్టర్ బసవరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి జరిమానతో పాటు వారి ట్త్రెనింగ్ మరో 10 రోజులు పొడిగించినట్టు ఆయన తెలిపారు.ఆసుపత్రిలో రీల్స్‌ చేసేందుకు స్టూడెంట్స్ ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని వారు తెలిపారు. వాటిని మేము ప్రోత్సహించం. వారు ఏం చేయాలనుకున్నా రోగులకు ఇబ్బంది కలగకుండా.. ఆసుపత్రి వెలుపల చేయాలి. ఇటీవల చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రిలో ఓ వైద్యుడు ఆపరేషన్‌ గదిలో తన ప్రీవెడ్డింగ్‌ షూట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కర్ణాటక వైద్యారోగ్యశాఖ మంత్రి దినేశ్‌ గుండూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుడిని తక్షణమే సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

Updated : 11 Feb 2024 7:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top