నీ విగ్రహం కావాలా నాయనా.. జస్ట్ రూ. 4 వేలే
X
విగ్రహాలు గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ లాంటి వాళ్లకు మాత్రమేనా, మనకు మాత్రం వద్దా? ఎవరి రంగాల్లో వాళ్లు గొప్పవాళ్లు. మన జీవితంలో మనకు మనమే గొప్ప. మనకూ ఓ విగ్రహం ఉండితీరాల్సిందే గురూ. ఎవరిదీ విగ్రహం అని జనం ఆరా తీయాల్సిందే... అని అనుకునే బీభత్సమైన ఆత్మాభిమానం ఉన్నవారికి చక్కని ఆఫర్.
త్రీడీ ప్రింటింగ్‌లో మన ముఖాల బొమ్మలు అచ్చం మన ముఖాల్లేగా తయారు చేసిస్తున్నాయి 3d karts వంటి కొన్ని కంపెనీలు. దీని కోసం లక్షలో, కోట్లో తగలెయ్యాల్సిన పనిలేదు. కనీసం పది వేలో, ఐదు వేలో ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం నాలుగువేలకే మన ముఖారవిందాల బొమ్మలను తయారు చేసిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో మన ఫోటో పంపి, కావాల్సిన బొమ్మ సైజు ఎంతో చెబితే చాలు భద్రంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వాళ్లు ఫోన్లను డబ్బాల్లో పంపినట్లు పంపుతారు. ముఖాల బొమ్మలే కాదు, నిల్చున్న, కూర్చున్న బొమ్మలు కూడా రెడీ. త్రీడీ మీనియేచర్ ప్రింటింగ్ పాశ్చాత్య దేశంలో పాతమే అయినా కారుచవక ధరకు అందుబాబులో రావడం బహుశా ఇదే ప్రథమం. కాకపోతే మనం పంపే ఫోటో చక్కగా ఉండాలి. లేకపోతే ‘ది నా బొమ్మేనా?’ అని హాశ్చర్య పోవాల్సి వస్తుంది.