Home > జాతీయం > మందుబాబుల రచ్చ.. ఐదో అంతస్తు బాల్కనీ స్లాబ్‌పై కూర్చొని..

మందుబాబుల రచ్చ.. ఐదో అంతస్తు బాల్కనీ స్లాబ్‌పై కూర్చొని..

'ఓరీ.. మీ అసాధ్యం కూలా.. ఇదేం పనిరా!!'

మందుబాబుల రచ్చ.. ఐదో అంతస్తు బాల్కనీ స్లాబ్‌పై కూర్చొని..
X


మద్యం తాగితే పర్లేదు కానీ.. తాగి రచ్చ రచ్చ చేస్తే మాత్రం తోటివారు ఇబ్బంది పడక తప్పదు. బర్త్ డే పార్టీ పేరుతో నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మద్యం సేవించిన నలుగురు వ్యక్తులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వారు చేసిన రచ్చకు అపార్ట్‌మెంట్ వాసులంతా ఒకచోటకు వచ్చారు. మద్యం తాగిన ఆ నలుగురిలో ఇద్దరు అపార్ట్మెంట్ బిల్డింగ్ బాల్కనీ స్లాబ్‌పై ప్రమాదకరరీతిలో కూర్చొని ఆందోళనకు గురిచేశారు. మరొకడు అపార్టమెంట్ బాల్కనీ వాల్ నుంచి వేలాడుతూ కంగారు పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్‌ 3న ఈ ఘటన చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌ వాసులు ఈ ఘటనను వీడియో తీయడంతో వైరల్‌గా మారింది.

గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని బిస్రాఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూపర్‌టెక్ ఎకోవిలేజ్ 3 లో అపార్ట్‌మెంట్‌ని అద్దెకు తీసుకున్న యోగేష్ శర్మ అనే వ్యక్తి తన పుట్టినరోజు అని తన ముగ్గురు స్నేహితులను ఆహ్వానించాడు. ఆ రోజు రాత్రి నలుగురు కలసి ఫుల్లుగా తాగారు. వారిలో ఇద్దరు అపార్ట్‌మెంట్‌ 5 వ అంతస్తు బాల్కనీ స్లాబ్‌పై కూర్చొని ఒకరిపై ఒకరు అరుచుకోవడం మొదలుపెట్టారు. ఈ ఘటనతో ఏం జరుగుతుందో తెలియక అపార్ట్‌మెంట్ వాసులు ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి ఘటనలు తరుచూ చోటుచేసుకుంటుండడంతో అపార్ట్‌మెంట్‌ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్లు ఉంటున్న అపార్ట్‌మెంటుల్లో ఇలాంటి చేష్టలు ఇబ్బంది కలిగిస్తున్నాయన్నారు.

ఆదివారం అర్ధరాత్రి సమయంలో అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న ఒకరు ఈ వీడియోను చిత్రీకరించారని SHO రాజ్‌పుత్ తెలిపారు. 1.13 నిమిషాల నిడివి గల వీడియోలో వారు చేసిన హంగామా బయటపడింది.సెంట్రల్ నోయిడా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ రమేష్ చంద్ పాండే మాట్లాడుతూ.. “ ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు, అయితే సిఆర్‌పిసి సెక్షన్ 151 (కాగ్నిజబుల్ నేరాల కమీషన్‌ను నిరోధించడానికి అరెస్టు) కింద సోమవారం బిస్రాఖ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. వారిలో ముగ్గురు ప్రైవేట్ బ్యాంక్‌లో పనిచేస్తుండగా, నాల్గవ వ్యక్తి కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నారు" అని చెప్పారు


Updated : 5 Sept 2023 8:13 AM IST
Tags:    
Next Story
Share it
Top