Home > జాతీయం > జమ్మూ కాశ్మీర్ లో త్రినేత్ర-2 ఆపరేషన్

జమ్మూ కాశ్మీర్ లో త్రినేత్ర-2 ఆపరేషన్

జమ్మూ కాశ్మీర్ లో త్రినేత్ర-2 ఆపరేషన్
X

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల జాడలేకుండా చేయడానికి భారత సైన్యం కష్టపడుతుంది. ఆపరేషన్ త్రినేత్ర-2 పేరుతో యుద్ధం మొదలుపెట్టింది. ఇప్పటివరకు నలుగురు ఉగ్రవాదులను మతమార్చారు.

జమ్మూకాశ్మీర్ లో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ మంచి ఫలితాలను ఇస్తోంది. త్రినేత్ర-2 పేరుతో ఉగ్రవాదులను మట్టుబెట్టడమే లక్ష్యంగా భారత సైన్యం పనిచేస్తోంది. నలుగురు ఉగ్రవాదులను హతమార్చామని సైన్యం ప్రకటించింది. నిన్న రాత్రి డ్రోన్ల సహాయంతో ఉగ్రవాదులను కదలికలను గుర్తించారు. అప్పటి నుంచి కాల్పులు మొదలుపెట్టారు. అవి ఈరోజు ఉదయం వరకు కొనసాగాయి. ఈ భారీ కాల్పుల్లోనే ఉగ్రవాదులు మరణించారు. ఈ ఆపరేషన్ ను భారత సైన్యంలోని ప్రత్యేక దళం, రాష్ట్రీయ రైఫిల్స్, సమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి చేశారు.

ఫూంచ్ లోని సురాన్ కోట్ దగ్గర సింధార మైదాన గ్రామాల్లో ఆపరేషన్ నిర్వహించారు. ఉగ్రవాదుల దగ్గర ఏకే-47 తుపాకులు, మరి కొన్ని ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. వీరు రాజౌరీ, ఫూంచ్ ప్రాంతాల్లో దాడులు చేయడానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల స్థావరాల్లో గ్రనేడ్లను సైతం స్వాధీనంచేసుకున్నారు. త్రినేత్ర-2 ఆపరేషన్ ను ఇంకా కొనసాగిస్తామని చెబుతున్నారు సైన్యం. ఫూంచ్ లోని ప్రదీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.

ఏప్రిల్ లో ఫూంచ్ లో భింబర్ గలీ నుంచి సాంగియోట్ కు వెళుతున్న సైనిక వాహనం మీద ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో 5గురు జవాన్లు మరణించారు. ఆ తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద దాడులు జరిగాయి. అప్పటి నుంచి త్రినేత్ర ఆపరేషన్ ను చేపట్టారు భారత సైన్యం. జైషే, లష్కరే సంస్థల క్షేత్రస్థాయి ఉగ్రవాదులు కలిసి దాడులు చేశాయని ఆర్మీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Updated : 18 July 2023 6:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top