Home > జాతీయం > రైల్వేలో 4 వేల పోస్టులు..అలర్ట్ అయిన కేంద్రం

రైల్వేలో 4 వేల పోస్టులు..అలర్ట్ అయిన కేంద్రం

రైల్వేలో 4 వేల పోస్టులు..అలర్ట్ అయిన కేంద్రం
X

ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడేవారు చాలా మంది ఉన్నారు. సంవత్సరాల తరబడి చదువుతూ పోటీపరీక్షలకు సమాయత్తం అవుతుంటారు. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో అలాంటి నోఫికేషనే వచ్చింది. కానీ అంది నిజం కాదు. అదొక ఫేక్ నోటిఫికేషన్. రైల్వేశాఖలో భారీగా కొలువులు అంటూ నోటిఫికేషన్లు జారీ అయ్యింది. 4,660 ఉద్యోగాలంటూ ఓ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ ఉద్యోగ ప్రకటన నిజం కాదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్సులో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ ఏప్రిల్ 15వ తేది నుంచి మే 14వ తేది వరకు ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుందంటూ ఆ ప్రకటనలో వివరాలు ఇచ్చారు. అయితే ఆ ప్రకటనను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో వేదికగా ఆ నోటిఫికేషన్‌కు సంబంధించి ఓ ప్రకటన చేసింది.

వైరల్ అవుతున్న నోటిఫికేషన్ ప్రకటన ఫేక్ అని, ఏదైనా నోటిఫికేషన్ విడుదల చేయాలంటే కచ్చితంగా రైల్వే మంత్రిత్వశాఖే దానిని విడుదల చేస్తుందని పీఐబీ స్పష్టం చేసింది. వ్యక్తిగత సమాచారాలను ఎవ్వరూ షేర్ చేయొద్దని సూచించింది. ఆర్పీఎఫ్ లో 452 ఎస్సై, 4,208 కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యకు సంబంధించిన ఉద్యోగ ప్రకటన ఫేక్ అని, దానిని ఎవ్వరూ నమ్మొద్దని స్పష్టం చేసింది.

Updated : 28 Feb 2024 4:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top