Home > జాతీయం > ఒడిశా రైలు..కరెంట్ షాక్‎తోనే 40 మంది మృతి

ఒడిశా రైలు..కరెంట్ షాక్‎తోనే 40 మంది మృతి

ఒడిశా రైలు..కరెంట్ షాక్‎తోనే 40 మంది మృతి
X

భీకరమైన ఒడిశా రైలు ప్రమాదంలో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది ప్రయాణికులు దారుణంగా చనిపోయారు. అయితే లేటెస్ట్ అప్‎డేట్ ప్రకారం వీరిలో దాదాపు 40 మంది ప్రయాణికులు మాత్రం కరెంట్ షాక్‎తోనే చనిపోయినట్లు తెలుస్తోంది. వారి శరీరాలపై ఎలాంటి గాయాలైన ఆనవాళ్లు లేకపోవడంతో వారు విద్యుత్ షాక్‎తోనే మరణించినట్లు భావిస్తున్నామని రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించిన ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. ప్రమాద సమయంలో లైవ్‌ ఓవర్‌హెడ్‌ కేబుల్‌ తెగి బోగీలపై పడి విద్యుత్‌ షాక్‌ జరిగిందని రైల్వే పోలీసులు చెబుతున్నారు.



కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓ గూడ్స్‌ రైలును ఢీకొట్టిడంతో రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో కొన్ని రైలు బోగీలు పక్కనున్న ట్రాక్‌పై పడిపోయాయి. అదే సమయంలో అటుగా వచ్చిన బెంగళూరు-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ కూడా రైలు పట్టాలు తప్పి కోరమాండల్‌ బోగీలను బలంగా ఢీకొట్టింది. భీకరమైన ఈ ప్రమాద ఘటనతో ఓవర్‌హెడ్‌ లోటెన్షన్‌ లైన్‌ విద్యుత్‌ తీగలు తెగి బోగీలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో బోగీల మధ్య పడి చాలా మంది శరీరాలు నలిగిపోయాయి. ఎన్నో మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కనిపించాయి. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. దీంతో విద్యుత్‌ షాక్ వల్లే వారు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదంపై ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దుర్ఘటన వెనుక కుట్ర కోణం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా సీబీఐ కూడా రంగంలోకి దిగింది. దర్యాప్తును ప్రారంభించింది.

Updated : 6 Jun 2023 2:44 PM IST
Tags:    
Next Story
Share it
Top