Home > జాతీయం > అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
X

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మళ్లీ భూకంపం వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 2.56 గంటలకు పోర్టుబ్లెయిర్‌ కు సమీప ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. పోర్టుబ్లెయిర్‌కు 112 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంచర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్లు చెప్పింది. భూకంపం వల్ల జరిగిన నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు చెప్పారు.

అండమాన్ దీవుల్లో ఈ నెలలో భూకంపం రావడం ఇది మూడోసారి. ఆగస్టు 2 తెల్లవారుజామున 5.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆగస్టు 3న సైతం 4.3 తీవ్రతతో భూమి కంపించింది. గత నెల 29న 5.8 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది.




Updated : 11 Aug 2023 7:44 AM IST
Tags:    
Next Story
Share it
Top