టెలిగ్రామ్ యాప్‌తో మగాళ్లకు వల.. రూ. 35 లక్షలు వసూలు
X
వన్నెచిన్నెలతో పురుషులను ఆకట్టుకొని, వాళ్ల నుంచి డబ్బులు వసూలు చేసే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఆ గ్యాంగ్‌లో ఉన్న ముగ్గుర్ని అరెస్టు చేశారు. అయితే హనీ ట్రాప్ చేసిన ప్రధాన నిందితురాలు ప్రస్తుతం పరారీలో ఉన్నది. ఆ నిందితురాలి పేరు నేహా అలియాస్ మేహర్. మరో ముగ్గురుతో కలిసి ఆమె సెక్స్ రాకెట్ నడిపింది. కర్నాటకలోని బెంగుళూరులో ఈ భారీ సెక్స్ రాకెట్(Sex Racket)ను గుట్టు రట్టు చేశారు పోలీసులు.
నేహా అలియాస్ మేహర్ అనే మహిళ.. టెలిగ్రామ్ యాప్ ద్వారా మగవాళ్లకు వలవేసి, ఆ తర్వాత శృంగారం కోసం వాళ్లను తన ఇంటికి ఆహ్వానించేది. శృంగారం చేస్తున్న సమయంలో మరో ముగ్గురు నిందితులు వీడియోలు తీసేవారు. ఆ తర్వాత ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసేవారని పోలీసులు వెల్లడించారు. మెహర్‌ను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఇస్లాం మతంలోకి మారాలని, లేదంటే డబ్బులు ఇవ్వాలని బాధితులను వేధించేవారు. బెదిరింపుల ద్వారా ఆ గ్యాంగ్ సుమారు 35 లక్షలకు పైగా వసూల్ చేసింది.
గత ఏడాదిన్నర కాలం నుంచి ఈ దందా నడుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలు మెహర్ ప్రస్తుతం ముంబైలో ఉన్నట్లు తెలిసింది. డిజిటల్ పేమెంట్ పద్ధతిలో సాగిన లావాదేవీల నుంచి 60 వేల అమౌంట్‌ను రికవర్ చేశారు. ఈ ముఠా ట్రాప్‌లో దాదాపు 50 మంది పురుషులు పడినట్లు తేలింది. ఆ గ్యాంగ్ గురించి ఓ బాధితుడు ఫిర్యాదు చేయగా ఈ కేసు బయటకు వచ్చింది. ఐపీసీలోని సెక్షన్ 348, 420 ప్రకారం పుట్టెనహల్లి పోలీసు స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేశారు. బాధితులను సుంతి చేసుకునేలా కూడా నిందితులు ప్రేరేపించినట్లు పోలీసులు తమ విచారణలో తేల్చారు.