Home > జాతీయం > ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. ప్రధానికి 500 మంది అమ్మాయిల లేఖ

ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. ప్రధానికి 500 మంది అమ్మాయిల లేఖ

ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. ప్రధానికి 500 మంది అమ్మాయిల లేఖ
X

పాఠాలు చెప్పాల్సిన అధ్యాపకులే పాడు బుద్ధులకు పాల్పడుతున్నారు. విద్యార్థినిలను లైంగికంగా వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. తాజాగా హర్యానాలోని ఓ లెక్చరర్ వేధింపుల బాగోతం బయటకు వచ్చింది. ఆ కీచకుడిపై ఏకంగా 500 మంది అమ్మాయిలు ప్రధాని సహా సీఎం, గవర్నర్కు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. హర్యానాలోని చౌదరి దేవీలాల్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ తమను ఆయన ఛాంబర్లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించేవాడని అమ్మాయిలు వాపోయారు.

తమ ప్రైవేట్ భాగాలను తాకేవాడని.. ఒకవేళ తాము నిరసన తెలిపితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించేవారి అమ్మాయిలలు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా ఇది జరుగుతుందన్నారు. నిందితుడైన ప్రొఫెసర్కు రాజకీయ పలుకుబడి ఉండడంతో వీసీ కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఇదే అంశంపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ స్పందించారు. పోలీసులు సహా వర్సిటీ కమిటీ దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇవి చాలా తీవ్రమైన ఆరోపణలని.. దోషీగా తేలితే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated : 9 Jan 2024 6:57 AM GMT
Tags:    
Next Story
Share it
Top