ఆయనకు 62, ఆమెకు 30.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు
X
ఆయనకు 62 ఏళ్లు. పిల్లల కోసం 30ఏళ్ల మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ట్విస్ట్ ఏంటంటే.. మొదటి భార్యే దగ్గరుండి ఈ వివాహం జరిపించింది. ఈ వయస్సులో ఆయన మరోసారి తండ్రయ్యాడు. రెండో భార్యకు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. దీంతో ఒకేసారి ట్రిపుల్ ధమాకా అందుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
సత్నా జిల్లాలో ఉచెహ్రా మండలం అతర్వేదియా ఖుర్ద్ గ్రామానికి చెందిన గోవింద్ కుష్వాహాకు 62 ఏళ్లు. ఆయన ఇటీవలె హీరాబాయి అనే 30ఏళ్ల మహిళను రెండో వివాహం చేసకున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భందాల్చగా సోమవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో హుటాహుటీనా జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సిజేరియన్ చేసి ప్రసవం చేయగా.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. శిశువులు కాస్త బలహీనంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా గోవింద్ కుష్వాహా మొదటి భార్య కస్తూరిబాయికి గతంలో ఓ కొడుకు పుట్టాడు. అయితే అతడు 18 ఏళ్ల వయసున్నప్పుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఆరేళ్ల క్రితం కస్తూరిబాయే దగ్గరుండి తన భర్తకు రెండో పెళ్లి జరిపించింది. ప్రస్తుతం ఒకేసారి ముగ్గురు పిల్లలకు తండ్రయ్యే సరికి గోవింద్ కుష్వాహా ఆనందానికి అవధులు లేవు.