Home > జాతీయం > చేయని నేరానికి 29 ఏళ్ల శిక్ష.. సారీ చెప్పిన పోలీసులు

చేయని నేరానికి 29 ఏళ్ల శిక్ష.. సారీ చెప్పిన పోలీసులు

చేయని నేరానికి 29 ఏళ్ల శిక్ష.. సారీ చెప్పిన పోలీసులు
X

చేయని నేరానికి ఓ మాజీ ఎస్​ఐ.. 29 ఏళ్ల శిక్ష అనుభవించాక.. అతడికి ఏ పాపం తెలియదని, నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది హైకోర్టు. తీర్పు కాస్త ఆలస్యంగా వచ్చినా న్యాయం జరిగినందుకు ఆ వ్యక్తి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్​కతా లో ఈ ఘటన జరిగింది. శైలేన్ దాస్ (70) అనే వ్యక్తి 1993లో కోల్​కతా పోలీస్​ శాఖ ఈఎస్‌డీ( Economic Statistics Division) డివిజన్ SI గా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఓ కేసులో శైలేన్​దాస్ ప్రమేయం ఉందని భావించిన ఉన్నతాధికారులు.. అతడిపై విచారణ చేపట్టి.. ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే శైలేన్​దాస్.. ఆ కేసులో తనతప్పేమి లేదని స్టేట్​ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(SAT)​లో ఫిర్యాదు చేశారు. కానీ అతడు చేసిన అభ్యర్థనను ఎస్​ఏటీ తిరస్కరించింది. దీంతో పట్టువదలని సైలన్​దాస్​ ట్రైబ్యునల్ తీర్పును కోల్​కతా హైకోర్టు(Calcutta High Court)లో సవాల్ చేశారు.

ఈ కేసు ఎంతకాలానికి పరిష్కారమవుతుందో తెలియని శైలేన్​దాస్​.. కోర్టు చుట్టూ తిరిగి ఉన్న డబ్బు కూడా పొగొట్టుకున్నాడు. ఆర్థిక స్థోమత సహకరించక, జీవనోపాధి అయిన ఉద్యోగంపై ఆశలు కూడా వదులుకున్నారు. అప్పటికే అనారోగ్య కారణాలతో ఆయన మంచం పట్టారు. అయితే మూడు దశాబ్దాల సుదీర్ఘకాలం తర్వాత కోల్​కతా హైకోర్టు ఆయనకు శుభవార్త తెలిపింది. శైలేన్​ దాస్​ను నిర్దోషిగా ప్రకటించి తీర్పు వెలువరించింది. దాస్​ను ఎక్కడున్న కనుక్కోవాలని పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో శైలేన్​దాస్​కు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించి.. కేసు మొత్తం వ్యవహారాన్ని కోర్టుకు నివేదించారు. పోలీసులు అన్ని ఫైళ్లు తిరగేసి అతికష్టంమీద శైలేన్​దాస్ చిరునామా కనుక్కొని.. అతడి ఇంటికి కారు పంపించి పోలీసు కార్యాలయానికి పిలిపించారు. ఆయన కేసు ఫైళ్లు అన్ని పరిశీలించి దాస్​ బాధితుడని ప్రకటించారు. తప్పు జరిగిపోయిందని పోలీసులు అతడిని క్షమాపణలు కోరారు. అంతేకాకుండా హైకోర్టు ఆదేశాల మేరకు శైలేన్​దాస్​కు రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందివ్వాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే.. కాస్త ఆలస్యంగానైనా కోర్టు తనకు న్యాయం చేసినందుకు మాజీ పోలీస్ ఆనందం వ్యక్తం చేశారు.

Updated : 17 Sep 2023 3:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top