Home > జాతీయం > మణిపుర్ నెత్తిపై మరో పిడుగు.. పక్క దేశం నుంచి అక్రమంగా..

మణిపుర్ నెత్తిపై మరో పిడుగు.. పక్క దేశం నుంచి అక్రమంగా..

మణిపుర్ నెత్తిపై మరో పిడుగు.. పక్క దేశం నుంచి అక్రమంగా..
X

హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపుర్ నెత్తిపై మరో పిడుగు పడింది. తెగల మధ్య వైరం కారణంగా రెండు నెలలుకు పైగా ఘర్షణలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మణిపుర్ లో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నా ఫలించడం లేదు. ఈ సమయంలో మరో కొత్త అంశం మణిపుర్ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. దాదాపు 700 మందికి పైగా మయన్మార్ వాసుల మణిపుర్ లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అందులో ఎక్కువగా మహిళలు, చిన్న పిల్లలు ఉన్నట్లు సమాచారం.

అస్సాం రైఫిల్ సెక్టార్ 28 అందించిన సమాచారం ప్రకారం.. ఎలాంటి పత్రాలు లేకుండా మణిపుర్ లోకి 301 మంది పిల్లలు, 208 మంది మహిళలు, 209 మంది పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా మణిపుర్ లోని చందేల్ జిల్లాలోకి అక్రమంగా ప్రవేశించారు. మయన్మార్ నుంచి మణిపుర్ ఆందోళన కారులకు అక్రమంగా ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు పోయిన నెలలో ఇంటలిజెన్స్ అధికారులు గుర్తించారు. అదే సమయంలో మయన్మార్ నుంచి మణిపుర్ కు ఆయుధాలు సరఫరా చేస్తున్న నలుగురిని భద్రతా దళాలు పట్టుకున్నాయి.




Updated : 25 July 2023 4:17 PM IST
Tags:    
Next Story
Share it
Top