Election Commission : స్టీల్ బ్యాలెట్ బాక్సుల నుంచి ఈవీఎంల వరకు.. ఈసీ ప్రయాణం సాగిందిలా!
X
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) 180 లోక్ సభ ఏర్పాటు కోసం జరిగే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఎలక్షన్ తేదీలపై చర్చలు, ఈవీఎంల పరిశీలనపై బిజీ అయిపోయింది. దేశం గణతంత్రంగా మారడానికి ఒక్క రోజు ముందు అంటే 1950 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ను స్థాపించారు. ఇక అప్పటి నుంచి ఈసీ 17 సార్వత్రిక, అనేక అసెంబ్లీ ఎలక్షన్స్ ను విజయవంతంగా నిర్వహించింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ ను జరిపింది. గత 75 ఏళ్లలో ఎన్నికల నిర్వహణలో చాలా మార్పులొచ్చాయి. మొదట బ్యాలెట్ బాక్సులు ఉండగా.. ప్రస్తుతం ఈవీఎంల శకంలోకి మారాం.
ఈసీ ప్రయాణం:
• తొలి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా అప్పటి ఐసీఎస్ అధికారి సుకుమార్ సేన్ నియమితులయ్యారు.
• 1950, మార్చి 1న బాధ్యతలు చేపట్టిన ఆయన.. 1951-51, 1957లో జరిగిన తొలి రెండు సార్వత్రిక ఎన్నికలను పర్యవేక్షించారు.
• తొలి సార్వత్రిక ఎన్నికల్లో స్టీల్ బ్యాలెట్ బాక్సులను ఉపయోగించారు.
• 70వ దశాబ్దం చివర్లో ఈవీఎంలను తీసుకొచ్చారు. 1999లో జరిగిన కొన్ని పార్లమెంట్ ఎన్నికలకు వాటిని విస్తరించారు.
• 2004లో 543 స్థానాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 10 లక్షలకు పైగా ఈవీఎంలను రూపొందించారు.
• 1993లో శేషన్ హయాంలో తొలిసారిగా ఓటరు గుర్తింపు కార్టు విధానాన్ని తీసుకొచ్చారు. 2015 నుంచి కలర్ వెర్షన్ లో డిజిటలైజ్డ్ ఫొటోలతో ఓటర్ ఐడీ కార్డులు వచ్చాయి.
• ఎలక్షన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు 2013లో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ ను (VVPAT) తీసుకొచ్చారు. తర్వాత 2014 ఎన్నికల్లో నోటా ఆఫ్షన్ ను తీసుకొచ్చారు.
• తొలి సార్వత్రిక ఎలక్షన్స్ లో 17.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 2019లో ఆ సంఖ్య 91.19కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.