Home > జాతీయం > విశ్రాంతి తీసుకునే వయసులో విద్యాలయానికి..స్ఫూర్తిగా నిలుస్తున్న తాత

విశ్రాంతి తీసుకునే వయసులో విద్యాలయానికి..స్ఫూర్తిగా నిలుస్తున్న తాత

విశ్రాంతి తీసుకునే వయసులో విద్యాలయానికి..స్ఫూర్తిగా నిలుస్తున్న తాత
X

ఏడు పదుల వయసు అంటే శరీరం ఏ మాత్రం సహకరించదు. ఈ వయసులో ఉన్నవారు ఎక్కువగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంటారు. సరదాగా మనవలు, మనవరాళ్లతో టైంపాస్ చేస్తుంటారు. కొంతమందైతే పూర్తిగా మంచానికే పరిమితమవుతుంటారు. అలాంటిది ఓ 78 ఏళ్ల వృద్ధుడు నీట్‎గా యూనిఫాం వేసుకుని చదువుకునేందుకు స్కూల్ బాట పట్టారు. చుదువుకునే వయసు దాటిపోయిందని సిగ్గుపడకుండా, విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన లేకుండా చిన్నారులతో కలిసి బడిలో పాఠాలు నేర్చుకుంటున్నారు. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

మిజోరంలోని చంపై జిల్లా హ్రుయికాన్ గ్రామానికి చెందిన లాల్రింగ్‌తర 1945 లో జన్మించారు. ఈయన చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. దీంతో తన బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. ఒక్కడే కొడుకు కావడంతో అమ్మ కష్టాలు లాల్రింగ్‌తర చూడలేకపోయారు. తన తల్లికి సహాయపడాలని నిర్ణయించుకున్నాడు. దీంతో చదువును మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. లాల్రింగ్‌తర ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఈయనకు మాతృభాషలో చదవడం , రాయడం వచ్చు. చదువు మధ్యలోనే ఆపడం వల్ల ఇంగ్లీషు నేర్చుకోలేకపోయాడు. ఈ క్రమంలో 78 ఏళ్ల వయసులో ఎలాగైనా ఇంగ్లీషు నేర్చుకోవాలనే ఆలోచన ఈయనలో కలిగింది. దీంతో స్కూలుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇంకేముంది ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి అడ్మీషన్ పొంది అందరి పిల్లలతో పాటే స్కూల్ యూనిఫాం ధరించి వీపుకు బ్యాగ్‌ వేసుకుని స్కూల్‎కు వెళ్తున్నాడు. అందులోనూ ప్రతిరోజు 3 కిలోమీటర్లు నడిచి మరీ బడికి వెళ్తున్నాడు.

ఈ తాత ఓ మీడియాతో మాట్లాడుతూ..."నా చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. అమ్మే అన్నీ చూసుకునేది. ఆమెకు ఆసరాగా ఉండాలని చదువు మధ్యలో ఆపేశాను. ఇప్పుడు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాను. నాకు ఇంగ్లీషు నేర్చుకోవాలనే ఆసక్తి కలిగింది. అప్లికేషన్లు ఫామ్ రాయడం, టీవీలో వచ్చే ఇంగ్లీసు న్యూస్ అర్థం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా స్కూల్‎లో చేరాను. పిల్లలతో పాటే బడికి వస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. లాల్రింగ్‌ ఏడు పదుల వయసులోనూ ఎంతో ఉత్సాహంతో చదువుకునేందుకు పాఠశాలకు వెళ్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.





Updated : 3 Aug 2023 5:53 PM IST
Tags:    
Next Story
Share it
Top