రామ మందిరంలో కొలువుదీరనున్న 4 అడుగుల రాముడు
X
అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు క్రతువుల్లో భాగంగా నవగ్రహ పూజ, యాగం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 1008 యజ్ఞగుండాలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే అయోధ్య గర్భగుడిలో కొలువుదీరనున్న శ్రీరాముడి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వాస్తవానికి అయోధ్యలో దశాబ్దాలుగా ఆరు ఇంచుల బాల రాముడి విగ్రహం పూజలందుకుంటోంది. సీత, లక్ష్మణ, హనుమంతుని విగ్రహాలు కూడా చిన్నగా ఉంటాయి. అయితే కొత్తగా నిర్మించిన శ్రీరామ మందిరంలో భక్తుల దర్శనం కోసం కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించారు.
అయోధ్య గర్భగుడిలో కొలువయ్యే శ్రీ రాముడు 4 అడుగులు పొడువు, 1.5 టన్నుల బరువు ఉన్నాడు. ఈ విగ్రహానికి జనవరి 22న ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని పూజారులు, పండితులు ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. అయోధ్యలో ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆరు ఇంచుల విగ్రహం సైతం.. ఉత్సవ మూర్తిగా.. ఊరేంగిచనున్నారు. గర్భగుడిలో కొత్తగా ఏర్పాటుచేసిన విగ్రహం.. నిత్యం భక్తులకు దర్శనమివ్వనుంది.
మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ రాముని 8 అడుగుల విగ్రహానికే ప్రాణప్రతిష్ట జరగనుంది. ఆయన గతంలో కేధార్నాథ్లోని ఆది శంకరాచార్య, ఇండియా గేట్ దగ్గర ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను రూపొందించారు. ప్రస్తుతం అయోధ్యలో ప్రాణం పోసుకోనున్న 8 అడుగుల రాముడి విగ్రహం సైతం అరుణ్ రూపమిచ్చారు. పెద్ద కళ్లతో జీవం ఉట్టిపడేలా శ్రీరాముడి విగ్రహం ఉందని అయోధ్య ఆలయ ట్రస్ట్ చెబుతోంది.