Home > జాతీయం > స్కూల్ మొదటి అంతస్తు నుంచి దూకేసిన పిల్లాడు

స్కూల్ మొదటి అంతస్తు నుంచి దూకేసిన పిల్లాడు

స్కూల్ మొదటి అంతస్తు నుంచి దూకేసిన పిల్లాడు
X

చిన్న పిల్లలు కార్టూన్ లు, సూపర్ హీరోస్ మూవీస్ చూడ్డం వరకు బాగానే ఉంటుంది...కానీ వాళ్ళల్లా వీళ్ళూ చేయాలనుకుంటేనే అసలు ప్రాబ్లెం అంతా. కాన్పూర్ లో ఓ పిల్లాడు ఇలాగే చేశాడు. సూపర్ మ్యాన్ అనుకుని స్కూల్ బిల్డింగ్ మీద నుంచి దూకేశాడు.

కాన్పూర్ జిల్లాలో ఓ స్కూలుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో స్కూల్ బిల్డింగ్ మీద నుంచి ఓ పిల్లాడు దూకేశాడు. అందరూ అక్కడే ఉన్నా ఎవ్వరూ ఆ బాబును గమనించలేదు. మధ్యాహ్నం లంచ్ టైమ్ లో జరిగిందీ ఘటన. బాబు మొదటి అంతస్తులోకి వెళ్ళడం అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే ఊరికే ఆడుకుంటూ వెళ్ళాడేమోలే అనుకున్నారు. కానీ తర్వాత రైలింగ్ ఎక్కి అక్కడి నుంచి దూకేశాడు. టీచర్లు, మిగతా స్టాఫ్ రియాక్ట్ అయ్యేలోపునే పిల్లాడు కాస్తా కిందపడిపోయాడు.

పిల్లాడు పడి తర్వాత పెద్ద శబ్ధం వచ్చింది. వెంటనే పరుగెత్తుకువెళ్ళిన టీచర్లు బాబుని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళారు. చిన్నారి నోటికి, కాలికి గాయాలయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. డాక్టర్ వీరేంద్ర స్వరూప్ ఎడ్యుకేషన్ సెంటర్ లో జరిగిందీ ఘటన. స్కూల్లో ఎవ్వరూ పట్టించుకోకపోవడం వల్లనే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. పిల్లాడిని అలా ఎలా వదిలేస్తారని అంటున్నారు వీడియోను చూసిన నెటిజన్లు.




Updated : 21 July 2023 3:10 PM IST
Tags:    
Next Story
Share it
Top