Bilkis Bano Case Update: బిల్కిస్ బానో కేసులో ట్విస్ట్.. 9 మంది దోషులు మిస్సింగ్
X
బిల్కిస్ బానో కేసులో తాజాగా సుప్రీం కోర్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలో ఏడుగురు సభ్యుల హత్య కేసులో 11 మంది దోషుల శిక్షా కాలం తగ్గింపుని రద్దు చేస్తూ జనవరి 8న సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది. రెండు వారాల్లో దోషుల్ని తిరిగి జైలుకు తిరిగి పంపించాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పు వెలువడ్డ నాటి నుంచి దోషుల్లో 9 మంది అదృశ్యమైనట్లు తెలుస్తుంది. ఈ కేసులో దోషులుగా ఉన్నవారంతాజజ దాహోద్ జిల్లాలోని రాంధిక్ పుర్, సింగ్వాద్ గ్రామాలకు చెందిన వారే.
గోధ్రా అల్లర్ల నాటికి బిల్కిస్ బానో కుటుంబం కూడా రాందిక్ పుర్ లోనే నివసించింది. నిందితులు గత వారం వరకు ఊర్లోనే ఉండగా.. సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చాక ఇళ్లకు తాళాలు వేసి పారిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ వార్తలపై స్పందించిన దాహోద్ ఎస్పీ.. తమకు సుప్రీం కోర్ట్ నుంచి ఇంకా ఎలాంటి తీర్పు కాపీ అందలేదని చెప్పుకొచ్చారు. శాంతి భద్రతల దృష్యా తీర్పు వచ్చినప్పటి నుంచి దోషుల గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు చెప్పుకొచ్చారు.