స్మార్ట్‌ఫోన్‌కు బానిసై మతిస్థిమితం కోల్పోయిన 10 ఏళ్ల బాలుడు
X
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వాడకం చాలా కామనైపోయింది. పసిపిల్లల నుంచి పండు ముసలివారి వరకు ప్రతి ఒక్కరు వినోదం, కాలక్షేపం కోసం ఫోన్లను విపరీతంగా వినియోగిస్తున్నారు. కొంత పరిమితి వరకు ఫోన్ వినియోగిస్తే పర్లేదు కానీ అదే పనిగా ఫోన్లకు గంటల గంటలు అతుక్కుపోవడంతో చాలా మంది ఈ మధ్యకాలంలో అనారోగ్యాన్ని గురవుతున్నారు. ఇక పిల్లల విషయానికి వస్తే స్మార్ట్‌ఫోన్ ఇవ్వకపోతే వారు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఏడ్చి గగ్గోలు పెట్టి మరీ తల్లిదండ్రులను సాధించి వారి నుంచి ఫోన్లను తీసుకుని అదే పనిగా వాటిని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా స్మార్ట్ఫోన్లలోని ప్లేస్టోర్ నుంచి వివిధ రకాల గేమ్స్‌ను ఇన్స్టాల్ చేసుకుని వాటితోనే గంటలు గంటలు గడిపేస్తున్నారు. అలా స్మార్ట్‌ఫోన్‌కు బానిసైన ఓ పదేళ్ల బాలుడు తాజాగా మతిస్థిమితం కోల్పోయాడు.
రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన ఓ బాలుడు అదే పనిగా స్మార్ట్‌ఫోన్‌ను వాడేవాడు. ఈ బాలుడు ఫోన్లో ఎక్కువ సమయం ఫ్రీఫైర్ గేమ్ తోనే గడిపేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇలా ఆట ఆడుతూ ఆడుతూ ఓడిపోయాడు. ఒక్కసారిగా ఓటమిపాలవడంతో షాక్‌కు గురైన బలుడు ఓటమిని తట్టుకోలేక మతిస్థిమితాన్ని కోల్పోయాడు. బాలుడి పరిస్థితిని గమనించిన పేరెంట్స్ వెంటనే వైద్యులను సంప్రదించారు. స్మార్ట్‌ఫోన్‌కు బానిస కావడం వల్లనే ఇలా అయ్యిందని చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం బాలుడికి ఓ స్పెషల్ స్కూల్ లో నిపుణుల సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఫిజికల్ గేమ్స్ ఆడిస్తూ అతడిని నార్మల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.