ఫుల్గా తాగి.. తానే పరమ శివుడినంటూ.. దారుణంగా
X
మద్యం మత్తులో ఓ వద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. పీకల దాకా తాగి తానే పరమ శివుడి అవతారాన్నంటూ ఓ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయ్ పూర్ జిల్లాకు చెందిన ప్రతాప్ సింగ్ (60) ఫుల్ గా మద్యం తాగి ఊళ్లోకి వెళ్తుండగా.. మార్గ మధ్యలో కల్కి బాయి (85) అనే వృద్ధురాలు ఎదురయింది. తనతో మాటలు కలిపిన ప్రతాప్ సింగ్.. తన పక్కన కూర్చోబెట్టుకుని తను శివుడి అవతారం అని, కల్కీ బాయి కోసమే శివుడు తనను పంపాడంటూ నమ్మించాడు. తనకు చంపి బతికించే శక్తి ఉందని చెప్పుకొచ్చాడు.
వెంటనే కల్కీ బాయిని కడుపులో కొట్టాడు. తన దగ్గరున్న గొడుగుతో తలపై బలంగా బాదాడు. దాంతో ఆవిడ కిందపడిపోయింది. అయినా వదలని ప్రతాప్ సింగ్ చావబాదాడు. అది చూసిన స్థానికులు అతన్ని ఆపే ప్రయత్నం చేసిన ఫలింతం లేకపోయింది. కల్కీబాయి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనంతా స్థానికులు వీడియో తీయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. కాగా, ఆ మహిళను గ్రామస్తులు మంత్రగత్తేగా అనుమానించారు. వాటిని కొట్టిపడేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.