Home > జాతీయం > రైలు పట్టాలపై లవ్ లెటర్...ఆ హృదయం ఎక్కడుందో?

రైలు పట్టాలపై లవ్ లెటర్...ఆ హృదయం ఎక్కడుందో?

రైలు పట్టాలపై లవ్ లెటర్...ఆ హృదయం ఎక్కడుందో?
X

ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనతో వందలాది మంది ప్రాణాలు రైలు కింద నలిగిపోయాయి. ప్రమాదం జిరిగిన ప్రాంతంలో క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. శవాల గుట్టలతో ఆ ప్రాంతం రక్తసిక్తమైంది. కానీ అదే సమయంలో అక్కడ ఒక ప్రేమకథకు ఆనవాళ్లు కనిపించాయి. అందరి హృదయాలను కదిలించాయి. రైలు ప్రమాదం జరిగిన చోట బెంగాలీ భాషలో రాసిన కాగితాలు చిందరవందరగా పడివున్నాయి. అవి చిత్తు కాగితాలు కాదు ఒక ప్రేమ కథకు ప్రతిబింబాలు. ఓ అబ్బాయి తాను ప్రేమించిన అమ్మాయిని ఊహించుకుంటూ రాసిన డైరీలోని కాగితాలు. అందులోని పదాలను చదివి అందరి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.


ఈ డైరీలోని కాగితాలు ప్రమాదానికి గురైన రైలులో ప్రయాణించి ఓ వ్యక్తివని తెలుస్తోంది. అందులో ఒక చేప, సూర్యుడు, ఏనుగు బొమ్మలను గీస్తూ ఆ యువకుడు తనలోని ప్రేమను అక్షర రూపంలో రాశాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఈ సెలవు రోజుల్లో తన ప్రియురాలిని ఊహించుకుంటూ తనలోని ప్రేమను వ్యక్తం చేసినట్లు అర్థమవుతోంది. అయితే ఆ ప్రయాణికుడు ఎవరు అన్నది సమాచారం లేదు. ఈ కాగితాలపై బెంగాలీ భాషలో రాసిన పదాల తెలుగులో అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరి మనసు కరిగిపోతుంది. ‘నేను నిన్ను ప్రతి నిముషం ప్రేమించాలని పరితపిస్తుంటాను. ఎందుకంటే నువ్వు నా హృదయానికి అంతలా దగ్గరయ్యావు’ అని రాసివుంది. ఆ కవితలు విన్నవారంతా కంటతడిపెట్టుకుంటున్నారు. అతను బ్రతికుండాలని కోరుకుంటున్నారు. ఈ డైరీలోని కాగితాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రేమికుడి గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.


బాలాసోర్‌లోని ప్రమాద స్థలంలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. అందులో భాగంగానే ఈ ప్రేమ కాగితాలు బయటపడ్డాయి. ప్రేమ కవితలతో కూడిన ఈ కాగితాలను భద్రంగా ఉంచుతామని పోలీసులు తెలియజేశారు. ఇప్పటి వరకూ ఈ కవితలు తనవే అంటూ ఎవరూ ముందుకు రాలేదని, ఈ కవితలు ఎవరు రాశారో తమకు తెలియదని పోలీసులు చెప్పారు.





Updated : 5 Jun 2023 1:54 PM IST
Tags:    
Next Story
Share it
Top