Home > జాతీయం > Rahul Gandhi : రాహుల్ గాంధీపై కేసు నమోదు

Rahul Gandhi : రాహుల్ గాంధీపై కేసు నమోదు

Rahul Gandhi  : రాహుల్ గాంధీపై కేసు నమోదు
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర కొనసాగుతోంది. అసోంలో రాహుల్ యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు అయ్యింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ‘‘హింసాత్మక ఘటనలు, ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసు సిబ్బందిపై దాడి వంటి చర్యలపై రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు’’ అని హిమంత ట్వీట్ చేశారు.

రాహుల్ గాంధీ సహా మిగితా వారిపై సుమోటోగా కేసు నమోదు చేశామని గువాహటి సీపీ దిగంత బోరా సైతం తెలిపారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో పాల్గొనేవారు నగరంలోని రద్దీ ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా.. పర్మిషన్ ఉన్న మార్గంలోనే వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని వివరించారు. అయినా యాత్రలో పాల్గొన్న వారు నగరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బారికేడ్లను తోసుకొని ముందుకెళ్లాలని నాయకులే ప్రోత్సహించడంతో కార్యకర్తలు రెచ్చిపోయి పోలీసులపై దాడి చేశారని చెప్పారు. ఈ దాడిలో నలుగురు సిబ్బందికి గాయాలైనట్లు తెలిపారు.


Updated : 24 Jan 2024 8:59 AM IST
Tags:    
Next Story
Share it
Top