Home > జాతీయం > గన్‎తో బెదిరించి కంపెనీ సీఈవో కిడ్నాప్.. నిందితుల్లో ఎమ్మెల్యే కుమారుడు

గన్‎తో బెదిరించి కంపెనీ సీఈవో కిడ్నాప్.. నిందితుల్లో ఎమ్మెల్యే కుమారుడు

గన్‎తో బెదిరించి కంపెనీ సీఈవో కిడ్నాప్.. నిందితుల్లో ఎమ్మెల్యే కుమారుడు
X

సినీ ఫక్కీల్లో ఓ కంపెనీ సీఈఓని కిడ్నాప్ చేసిన ఘటన ముంబైలో జరిగింది. సుమారు 15 మంది వ్యక్తులు ఓ ఆఫీస్ లోకి ప్రవేశించి సీఈఓపై తుపాకీ గురి పెట్టి కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్స్‎ను పోలీసులు వెంబడించి బాధితుడిని రక్షించారు. ఈ కేసులో షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే కుమారుడు ఉండడం కలకలం రేపుతోంది. ఆర్థికలావాదేవీలు కారణంగానే ఈ కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ముంబై శివారులోని గోరెగావ్‌ ప్రాంతంలో గల చింతామణి క్లాసిక్‌ కాంప్లెక్స్‌‎లో ఉన్న మ్యాజిక్ కంపెనీ సీఈఓ రాజ్ కుమార్ సింగ్‎కు నగరంలోని ఆది శక్తి ప్రైవేట్‌ లిమిటెడ్‌ మ్యూజిక్‌ కంపెనీ నిర్వహిస్తున్న మనోజ్ మిశ్రాతో గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. మనోజ్ మిశ్రాకు రాజ్ కుమార్ రూ.8 కోట్లు అప్పుగా ఇచ్చాడు. వాటిని తిరిగి ఇవ్వాలని కోరగా..రాజ్ కుమార్ పై బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలోనే షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే ప్రకాశ్ సుర్వే ఫోన్ చేసి వెంటనే తన ఆఫీస్‎కు రావాలని రాజ్ కుమార్ ని బెదిరించాడు. అందుకు రాజ్‌ కుమార్‌ నో చెప్పడంతో కొద్దిసేపటికే రెండు కార్లల్లో సుమారు 10 నుంచి 15 మంది వ్యక్తులు ఆఫీస్‎కు వచ్చి తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని క్షేమంగా రక్షించారు.

తనను కిడ్నాప్‌ చేసిన దుండగులు ఎమ్మెల్యే ఆఫీసుకు తీసుకెళ్లినట్లు రాజ్‌ కుమార్‌ పోలీసులకు తెలిపారు. అక్కడ ఎమ్మెల్యే కుమారుడు రాజ్‌ సుర్వే (Raj Surve) తనను గన్‌ తో బెదిరించి కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నట్లు చెప్పాడు. ఈ మేరకు పోలీసులు రాజ్‌ సుర్వే, మనోజ్‌ మిశ్రా సహా మరో 10 మందిపై కేసు నమోదు చేశారు.





Updated : 10 Aug 2023 10:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top