మెట్రో ట్రైన్‌లో మళ్లీ రెచ్చిపోయిన లవర్స్.. అక్కడే కానిచ్చారు
X
దేశంలోని ముంబై, చెన్నై, కోల్‌కత్తా, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లోని మెట్రో సర్వీసులు.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ.. ప్రశంసలందుకుంటున్నాయి. కానీ దేశ రాజధాని ఢిల్లీ మెట్రో అందుకు పూర్తి విరుద్ధం. ఢిల్లీలోని మెట్రో సర్వీసు వార్తల్లో(వివాదంలో) ఇరుక్కునంతగా మరే నగరం కూడా వార్తల్లో నిలవలేదు. వెకిలి చేష్టలు, విచ్చలవిడి రొమాన్స్, మహిళను చూస్తూ చేసే వికృత చేష్టలన్నింటికీ ఢిల్లీ మెట్రో కేరాఫ్‌గా మారిపోయింది. లిప్ లాక్‌లు, హగ్గులు ఒకటేమిటి ఇలా ఒక వీడియో తర్వాత మరో వీడియో రెండు మూడు రోజులకొకసారి సోషల్ మీడియాల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. చుట్టూ ఉన్న జనం చూస్తున్నారనే ఇంగితం కూడా లేకుండా యువ జంటలు సన్నిహితంగా ఉండటం.. బహిరంగంగానే రొమాన్స్‌లో ముగినిపోతున్నారు.
మెట్రోలో ప్రయాణించే ఇలాంటి కామాంధుల అనుచిత ప్రవర్తనతో తోటి ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు అనేక నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది. తాజాగా ఢిల్లీ మెట్రో కోచ్‌లో యువతీ, యువకుడు ముద్దుపెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు మండిపడుతున్నారు.
ఢిల్లీలోని ఆనంద్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో యువతీ, యువకుడు ముద్దులతో రెచ్చిపోయారు. మెట్రో డోర్‌కు ఆనుకొని ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దులు పెట్టుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్‌మ్యాన్ అనే నెటిజన్ ట్విటర్ (ఎక్స్) ఖాతాలో పోస్టు చేశాడు. దీనికి ‘ప్రేమ గుడ్డిది.. మనుషులు కాదని మనం మరిచిపోయి ఉండవచ్చు’ అంటూ ఓ పోస్ట్‌ను జత చేశాడు. ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో స్పందించింది. ఇలాంటి అవాంఛనీయ ఘటనల సమయంలో మెట్రో సిబ్బంది లేదా సీఐఎస్ఎఫ్ కి వెంటనే తెలియజేయండి.. తద్వారా తగిన చర్యలు తీసుకోవచ్చు అని ప్రయాణికులను కోరింది.
Another emotional video of Anand Vihar #delhimetro (OYO).
— Postman (@Postman_46) September 21, 2023
Maybe we have forgotten that love is blind, people are not.#HBDAtlee #ISKCON #ICCRankings #JustinTrudeau #Shubh #MindfulLiving #PeaceDay #CHEN #TejRan #ShafaliVerma pic.twitter.com/EKSJs2p54d