Home > జాతీయం > ఇది దున్నపోతు కాదు మేక..బరువు 176 కేజీలు

ఇది దున్నపోతు కాదు మేక..బరువు 176 కేజీలు

ఇది దున్నపోతు కాదు మేక..బరువు 176 కేజీలు
X

సాధారణంగా ఓ మేక మహా అయితే 20 కిలోల వరకు బరువు పెరుగుతుంది. కొన్ని సార్లు 50 కిలోల వరకు కూడా బరువు ఉండవచ్చు. కానీ మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో మాత్రం ఓ మేక ఏకంగా 176 కిలోల బరువు పెరిగింది. ఇంతటి భారీ మేకను బక్రీద్ సందర్భంగా అమ్మకానికి పెట్టాడు మేక యజమని. మరి ఈ మేక ఎంత ధరకు అమ్ముడు పోయిందో తెలుస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. అక్షరాలా 12 లక్షలకు మేక అమ్ముడుపోయింది. యజమాని పంట పండింది.





మధ్యప్రదేశ్‌లోని కోటా బ్రీడ్‎కి చెందిన మేక ఇది. సుహైల్ అహ్మద్ అనే వ్యక్తి దీనిని పెంచుకున్నాడు. 8 నెలల క్రితం రాజస్థాన్‌ నుంచి ఈ మేకను కొనుగోలు చేశాడు. ఆ తరువాత మేక ఆరోగ్యంగా పెరిగేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రేమగా





పెంచుకున్న ఈ మేకకు కింగ్ అని నామకరణం చేశాడు. ప్రతి రోజు మేకకు శనగలు, గోధుమలు, పాలు, ఖర్జూరం, వంటి బలమైన ఆహార పదార్థాలనే అందించేవాడు. వేసవిలోనూ మేకకు వేడి గాలులు తగలకుండా ప్రత్యేకంగా రెండు కూలర్లను ఏర్పాటు చేశాడు. యజమాని తీసుకున్న ప్రత్యేక జాగ్రత్తలకు ఈ మేక ఏకంగా 176 కిలోల వరకు బరువు పెరిగింది. బక్రీద్ సందర్భంగా కింగ్‌ను ఇటీవల అమ్మకానికి పెట్టాడు సుహైల్ అహ్మద్. ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 12 లక్షలు చెల్లించి మరీ కింగ్‌ను కొనుగోలు చేశాడు.





Updated : 27 Jun 2023 3:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top