2కిలోల టమాటాల కోసం ఎవరో పిల్లలను తాకట్టుపెట్టిన ఘనుడు
X
దేశంలో టమాట ధరలు పెరగడం విపరీతాలకు దారితీస్తోంది. టమాటాలకు అలవాటు పడిన జనాలు దాని కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. దొంగతనాలు చేస్తున్నారు, దోపిడీలు పాల్పడుతున్నారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు...ఒడిశాలో ఒకడు చేసింది మాత్రం వేరే లెవల్. రెండు కిలోల టమాటల కోసం ఎవరో పిల్లలను తాకట్టు పెట్టి వెళ్ళిపోయాడు.
ఒడిశాలోని కటక్ లో జరిగిందీ ఈ ఘటన. అక్కడ చత్రబజార్ కూరగాయల మార్కెట్లో నందు అనే టమాటా వ్యాపారి దగ్గర ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలను తీసుకుని వచ్చాడు. కస్టమర్ గా నటిస్తూ కిలో టమాటా ధర 130 రూ.లకు బేరం అడుకున్నాడు. ముందు రెండు కిలోలు తీసుకున్నాడు.ఇంకా 10 కిలోలలు కావాలని...ఇప్పడు తీసుకున్నవి కార్లో పెట్టివస్తానని...కారులో పర్స్ మర్చిపోయానని తీసుకువస్తానని చెప్పి వెళ్ళాడు. అప్పటివరకు పిల్లలను చూసుకోమని చెప్పాడు.
నందు సరే అని పిల్లలను తన పక్కన కూర్చోపెట్టుకుని సదరు వ్యక్తి కోసం ఎదురు చూసాడు. అయితే వెళ్ళినవాడు ఎంతసేటికీ తిరిగిరాలేదు. అనుమానం వచ్చి ఇద్దరు పిల్లలను అడగ్గా...అతనెవరో తమకు తెలియదని...పని ఇప్పిస్తానని తీసుకువచ్చాడని చెప్పారు. 300 రూ. ఇప్పిస్తానని చెప్పాడని తెలిపారు. దాంతో నందు తాను మోసపోయానని అర్ధం చేసుకున్నాడు. తన దగ్గర ఉన్న ఇద్దరు పిల్లను విడిపించి పంపేశాడు. పిల్లల పేర్లు బబ్లూ బారిక్, ఎస్కార్ మహంతి అని తెలుస్తోంది. ముందు పిల్లలిద్దరినీ నందు పోలీస్ స్టేషన్ లో అప్పగించి కంప్లైంట్ చేశారు. కానీ ఎంతసేపటికీ పిల్లల కోసం ఎవ్వరూ రాకపోవడంతో మళ్ళీ తానే విడిపించారు కూడా.
ప్రతీ ఏడాది ఒక టైమ్ లో టమాటాల ధరలు పెరుగుతాయి. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తాయి. కానీ ఈసారి ధరలు అస్సలు దిగడం లేదు. పైగా రోజు రోజుకూ పెరుగుతున్నాయి కూడా. కొన్ని ప్రాంతాల్లో టమాటల ధరలు కిలో 200రూ. లుగా కూడా ఉంది.