Home > జాతీయం > గజ్వేల్లో కరెంట్ బిల్‌ గొడవ.. లైన్‌మెన్‌పై పెట్రోల్‌ పోసి..

గజ్వేల్లో కరెంట్ బిల్‌ గొడవ.. లైన్‌మెన్‌పై పెట్రోల్‌ పోసి..

గజ్వేల్లో కరెంట్ బిల్‌ గొడవ.. లైన్‌మెన్‌పై పెట్రోల్‌ పోసి..
X

కరెంట్ బిల్ కట్టమన్నందుకు ఓ వ్యక్తి లైన్‌మెన్‌తో గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా అతడిపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని క్యాసారంలో జరిగింది. క్యాసారం గ్రామంలోని సుంకరి కరుణాకర్‌ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గత 2 నెలలుగా అతడు కరెంట్ బిల్ కట్టడం లేదు. అయితే 1200 బిల్ కట్టాలని లైన్‌మెన్‌ నరేష్ కోరాడు.

బిల్ విషయంలో కరుణాకర్, లైన్‌మెన్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో లైన్‌మెన్‌ కరుణాకర్ ఇంటికి కనెక్షన్ తొలగించాడు. దీంతో ఆవేశానికి లోనైనా కరుణాకర్ తన బైక్ లోంచి పెట్రోల్ తీసి లైన్‌మెన్‌పై పోశాడు. నిప్పంటించడానికి ప్రయత్నించగా కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. తమకు జీతం రాలేదని, రెండుమూడు రోజుల్లో చెల్లిస్తామని చెప్పినప్పటికీ నరేష్‌ వినకుండా కరెంట్ కనెక్షన్ తొలగించినట్లు కరుణాకర్‌ భార్య కావ్య ఆరోపించారు.

తనపై కరుణాకర్ హత్యాయత్నం చేసినట్లు లైన్‌మెన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. మరోవైపు లైన్‌మెన్‌పై జరిగిన హత్యాయత్నంపై విద్యుత్ శాఖ అధికారులు సీరియస్ అయ్యినట్లు తెలుస్తోంది. బిల్ కోసం వెళ్తే హత్యాయత్నం చేసిన సదరు వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు సమాచారం.


Updated : 2 July 2023 11:22 AM IST
Tags:    
Next Story
Share it
Top