Home > జాతీయం > ఘోర విషాదం.. దొర్లుకుంటూ కారుపై పడ్డ బండరాయి.. సెకన్ల వ్యవధిలోనే మరొకటి

ఘోర విషాదం.. దొర్లుకుంటూ కారుపై పడ్డ బండరాయి.. సెకన్ల వ్యవధిలోనే మరొకటి

ఘోర విషాదం.. దొర్లుకుంటూ కారుపై పడ్డ బండరాయి.. సెకన్ల వ్యవధిలోనే మరొకటి
X

చావు అనేది ఎప్పుడు, ఏ క్షణంలో , ఎటువైపు నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. నాగాలాండ్‌లోని దిమపుర్ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అప్పటి వరకూ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ.. కారులో వెళుతున్న ఆ వ్యక్తులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రాణాలు పోయాయి. దిమపుర్ - కోహిమా నేషనల్​ హైవేపై నిన్న(మంగళవారం) సాయంత్రం 5 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే నిజంగానే షాక్ అవుతారు.





ఏం జరిగిందంటే.. దిమపుర్ జిల్లాలోని చుమౌకెడిమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా దిమపుర్ - కోహిమా నేషనల్​ హైవేపై 'పాలక్ పహార్' వద్ద ట్రాఫిక్ కొన్ని క్షణాల పాటు ఆగింది. ఆ సమయంలో, కారులో వెళుతున్న వ్యక్తి ముందు పార్క్ చేసిన కార్లను వీడియో తీస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా ఉన్న కారుపై సమీపంలో కొండపై నుంచి ఓ భారీ బండరాయి అతివేగంగా దొర్లుకుంటూ.. వచ్చి పడింది. పడిన కొద్ది క్షణాల్లోనే మరో బండరాయి ఇంకో కారుపై పడింది. దీంతో మూడు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి గురైన కార్ల వెనుక ఉన్న మరో వాహనంలోని ఓ వ్యక్తి.. ఈ ఘటనను వీడియో తీశాడు.

ప్రమాదం పట్ల నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 4 లక్షల ఎక్స్​గేషియా ప్రకటించారు. జాతీయ రహదారి వెంబడి ప్రమాదకర ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు, భద్రత ప్రమాణాలు మెరుగుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం.. భారత ప్రభుత్వం, నేషనల్ హైవే నిర్వాహకులతో కలిసి చర్యలు తీసుకుంటామని సీఎం నెఫ్యూ ట్విట్టర్​లో పేర్కొన్నారు.




Updated : 5 July 2023 8:26 AM IST
Tags:    
Next Story
Share it
Top