Home > జాతీయం > మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు అరుదైన గౌరవం

మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు అరుదైన గౌరవం

మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు అరుదైన గౌరవం
X

భారత మహిళ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ దీప్తిశర్మని ఉత్తరప్రదేశ్ సర్కార్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా నియమించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆమెకు డీఎస్పీ నియామక పత్రంతో పాటు రూ.3 కోట్లు నగదు నజరానా కూడా అందిజేశారు.దీనికి సంబంధించిన ఫొటోలను దీప్తి శర్మ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం దీప్తి శర్మ వయసు 26 ఏళ్లు. యూపీలోని ఆగ్రా దీప్తి శర్మ స్వస్థలం. 17 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన దీప్తి శర్మ టీమిండియాలో నమ్మదగిన ఆల్ రౌండర్ పేరుతెచ్చుకుంది. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ రాణిస్తోంది.ఇటీవల ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ పోటీలు కూడా నిర్వహించగా, భారత జట్టే చాంపియన్ గా నిలిచింది. అందులో దీప్తి శర్మ ప్రతిభకు మెచ్చిన యూపీ సర్కారు డీఎస్పీ ఉద్యోగంతో పాటు, నగదు నజరానా ప్రకటించింది.

దీప్తి విజయ ప్రయాణం ఆగ్రాలోని అవధ్ పూరి లోని సాధారణ పరిసరాలలో ప్రారంభమైంది. అక్కడ ఆమె దీపక్ చాహర్ వంటి స్థానిక ప్రతిభావంతులతో కలిసి తన క్రికెట్ నైపుణ్యాలను మ‌రింత‌గా అభివృద్ధి చేసుకుంది. అద్భుత‌మైన ఆట తీరుతో దీప్తి శ‌ర్మ 2014లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆల్ రౌండ‌ర్ 194 మ్యాచ్ ల‌ను ఆడి 229 వికెట్లు పడగొట్టింది. 2018, 2022లో జరిగిన మహిళల ఆసియా కప్ లో అద్భుత‌మైన ఆట‌తో ప్ర‌శంస‌లు అందుకుంది. దీప్తి శర్మ కెరీర్ లో ఇప్పటివరకు 104 అంతర్జాతీయ టీ20లు ఆడి 1,015 పరుగులు చేసింది. అదే సమయంలో 113 వికెట్లు పడగొట్టింది. 86 వన్డేల్లో 1,982 పరుగులు చేసి, 100 వికెట్లు తీసింది. ఇప్పటివరకు 4 టెస్టుల్లో 317 పరుగులు చేసి, 16 వికెట్లు పడగొట్టింది. వన్డేల్లో ఒక సెంచరీ నమోదు చేసింది.

Updated : 30 Jan 2024 9:36 PM IST
Tags:    
Next Story
Share it
Top