గోల్డెన్ టెంపుల్ గణపయ్యకు అరుదైన వైడూర్యంతో బంగారు కిరీటం..
X
తిరుపతి, కాణిపాకం వెళ్లే భక్తులు తప్పనిసరిగా వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ను సందర్శిస్తారు.ఈ ఆలయం మొత్తం బంగారు వర్ణంలో ధగధగామెరుస్తుంటుంది. ఆలయ గోపురాన్ని టీటీడీ స్వర్ణకారులు బంగారంతో నిర్మించారు. ఈ ఈ స్వర్ణ ఆలయం నిర్మాణానికి దాదాపుగా రూ.600 కోట్లు వరకు ఖర్చు అయినట్లు సమాచారం. దాదాపు 1,500 కిలోల బంగారాన్ని వినియోగించారని తెలుస్తోంది. ఈ గుడిలో బంగారు లక్ష్మీదేవి అమ్మవారితో సహా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అతిపెద్ద శ్రీ శక్తి గణపతి విగ్రహాన్ని 2021లో ఈ ఆలయంలో ప్రతిష్టించారు. సుమారు 1700 కిలోల వెండితో రూపొందించిన ఈ గణపయ్యను దర్శించుకునేందుకు ఎక్కడి నుంచో భక్తులు తరలివస్తుంటారు. తమకు తోచిన కానుకలను స్వామివారికి సమర్పిస్తుంటారు.
గణపయ్య శిరస్సుపై ఈ అరుదైన కిరీటాన్ని అలంకరించి రాకార్డులు సృష్టిస్తున్నారు ఆలయ నిర్వాహకులు . ఎందుకంటే ఈ కిరీటానికి అంతటి స్పెషాలిటీ ఉంది. నవరత్నాల్లో ఒకటైన సైమోఫేన్ అనే రత్నాన్నిఈ స్వర్ణ కిరీటంలో పొదిగారు. ఈ ఒక్క రత్నమే దాదాపు 880 క్యారెట్లు ఉండటం విశేషం. ఈ సైమోఫేన్ రత్నం ధరనే దాదాపుగా 8 కోట్ల రూపాయల వరకు ఉంటుందట. ఈ విషయాన్ని దేవస్థానం బోర్డే స్వయంగా తెలిపింది. తెల్లటి రంగులో ఉండే వినాయకుని విగ్రహానికి ఈ అరుదైన వైడూర్యంతో రూపొందించిన స్వర్ణ కిరీటం ఎంతో శోభాయమానంగా కినిపిస్తోంది.