MODI : 250 అడుగుల మోదీ విగ్రహం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
X
ప్రపంచంలో అత్యుత్తమ ప్రధానులలో మోదీ ఒకరని, ఆయన విగ్రహాన్ని నెలకొల్పే అవకాశం రావడం అదృష్టమని వ్యాపారవేత్త నబీన్ చంద్రబోరా అన్నారు. ప్రస్తుతం దేశంలో విగ్రహాల హవా నడుస్తోందని, అత్యంత ఎత్తైన విగ్రహాలను ఆవిష్కరిస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారని నబీన్ చంద్రబోరా తెలిపారు. అసోంలోని గువాహటికి చెందిన ఆయనకు జలుక్‌బరి ప్రాంతంలో సొంత స్థలం ఉంది. బస్టాండ్ సమీపంలో ఉన్న ఆ స్థలంలోనే ప్రధాని మోదీ విగ్రహాన్ని నెలకొల్పనున్నాడు.
గువాహటి ప్రాంతంలో మూడు రోజులుగా భూమిపూజ కార్యక్రమాన్ని నబీన్ చంద్రబోరా చేపట్టారు. అక్కడ 250 అడుగుల ఎత్తుతో ప్రధాని మోదీ విగ్రహాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. 250 అడుగుల్లో పీఠం 60 అడుగులు, విగ్రహం 190 అడుగులు ఉంటుంది. ఈ విగ్రహం నిర్మాణం కోసం దాదాపు రూ.200 కోట్లను ఖర్చు చేయనున్నట్లు బోరా తెలిపారు. ఈ కాంగ్య విగ్రహానికి సంబంధించి ఇప్పటికే డిజైన్ కూడా పూర్తయ్యిందన్నారు.
తాను నిర్మించబోయే మోదీ విగ్రహం మెడపై అస్సామీ సంస్కృతికి సంబంధించిన గామోసా చిహ్నం ఉంటుందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రధానులలో మోదీ ఒకరని, ఆయన విగ్రహాన్ని నెలకొల్పడం సంతోషంగా ఉందని బోరా తెలిపారు. ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీతోనే ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తానని వ్యాపారవేత్త నబీన్ చంద్రబోరా తెలిపారు.