Home > జాతీయం > పామును కొరికి చంపిన మూడేళ్ల బాలుడు.. ఆ తర్వాత!

పామును కొరికి చంపిన మూడేళ్ల బాలుడు.. ఆ తర్వాత!

పామును కొరికి చంపిన మూడేళ్ల బాలుడు.. ఆ తర్వాత!
X

పామును ఆట వస్తువు అనుకుని.. నోట్లో పెట్టుకుని కొరికి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్, ఫరూఖాబాద్ జిల్లాలోని మద్నాపూర్ గ్రామంలో దినేశ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం అతని మూడేళ్ల కొడుకు సుప్రబాత్ ఇంటి ముందు ఆడుకుంటుండగా.. ఒక పాము వచ్చింది. అది కూడా ఆటవస్తువు అనుకున్న ఆ బాలుడు.. పామును నోట్లో పెట్టుకుని నవిలాడు. దాంతో ఆ పాము చనిపోయింది.

కొంతసేపటికి అతని అమ్మమ్మ సూనీత వచ్చి చూడగా.. బాలుడి నోటి నిండా రక్తం.. పక్కన పాము కనపడింది. వెంటనే నీళ్లతో ఆ బాబు నోరు కడిగి.. హాస్పిటల్ కు తీసుకెళ్లింది. దాంతో ప్రమాదం తప్పింది. ఆ పిల్లాడికి వైద్య పరిక్షలు చేసిన డాక్టర్లు ఏం ప్రమాదం లేదని చెప్పారు. ప్రస్తుతం ఆ పిల్లాడి పరిస్థితి నిలకడగా ఉంది. ఇప్పుడే కోలుకుంటున్నాడు.

Updated : 4 Jun 2023 9:30 PM IST
Tags:    
Next Story
Share it
Top