Home > జాతీయం > ప్రేమజంటకు శ్మశానంలో పెళ్లి..మహారాష్ట్రలో అరుదైన ఘటన..

ప్రేమజంటకు శ్మశానంలో పెళ్లి..మహారాష్ట్రలో అరుదైన ఘటన..

ప్రేమజంటకు శ్మశానంలో పెళ్లి..మహారాష్ట్రలో అరుదైన ఘటన..
X

ప్రతి ఒక్కరు తమ పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలని భావిస్తారు. అందుకోసం ఎంత మొత్తంలో అయినా ఖర్చు చేసేందుకు వెనకాడరు. స్థాయి ఉంటే కొంతమంది విమానంలో పెళ్లి చేసుకుంటారు, మరికొంత మంది లగ్జరీ క్రూజ్‎లో లగ్గం చేసుకుంటారు. కానీ ఓ ప్రేమ జంట మాత్రం ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విధంగా తమ వివాహం శ్మశానంలో చేసుకుని అందరిని అవాక్కు చేశారు. ప్రతి ఒక్కరి జీవితం శ్మశాన వాటికలోనే ముగుస్తుంది. కానీ ఈ ప్రేమజంట కొత్త జీవితం మాత్రం శ్మశానం నుండే ప్రారంభమయ్యింది.

మహారాష్ట్రలో ఈ అరుదైన పెళ్లి జరిగింది. శ్మశానంలోనే పెద్దల సమక్షంలో ఈ ప్రేమ జంట వివాహం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అహ్మద్‌నగర్ జిల్లా శిర్డీ సమీపంలోని రహతా గ్రామానికి చెందిన గంగాధర్ ది మహాసంజోగీ సామాజిక వర్గం. ఈయన స్థానికంగా ఉన్న శ్మశాన వాటికలో కొన్నేళ్లుగా కాటికాపరిగా పనిచేస్తున్నారు. తన కుటుంబంతో కలిసి శ్మశానంలోనే కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. ఈయనకు మయూరి అనే ఓ కూతురు ఉంది. ఆమె కూడా శ్మశానంలోనే పుట్టి పెరిగింది. ఇంటర్ వరకు చదువుకున్న మయూరి , మనోజ్ అనే అబ్బాయితో ప్రేమలో పడింది. రెండు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకారం తెలిపాయి. అయితే మయూరి తండ్రి గంగాధర్ మాత్రం తన కూతురు పుట్టి పెరిగిన చోటే పెళ్లి చేయాలని అని కోరారు.దీనికి మనోజ్ పేరెంట్స్ కూడా అంగీకారం తెలపడంతో పెళ్లి బంధువులు, స్నేహితుల సమక్షంలో శ్మశానంలోనే అంగరంగవైభవంగా జరిగింది.

హిందువులు శ్మశానవాటికను పవిత్రమైనదిగా పరిగణించరు. అందుకే ఆ ప్రదేశంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. కానీ, అహ్మదాబాద్‎కు చెందిన గంగాధర్ గైక్వాడ్ తన కుమార్తె వివాహాన్ని శ్మశానంలో చేశారు. వివాహ సమయంలో నిర్వహించే అన్ని సంప్రదాయ ఆచారాలను శ్మశానంలోనే పాటించారు. తన కోరికను నెరవేర్చుకున్నారు.



Updated : 27 July 2023 6:16 AM GMT
Tags:    
Next Story
Share it
Top